Begin typing your search above and press return to search.

స‌న్నీ కూతురు చిట్టీ 2.0

By:  Tupaki Desk   |   19 Nov 2018 1:30 AM GMT
స‌న్నీ కూతురు చిట్టీ 2.0
X
శృంగార తార స‌న్నీలియోన్ బాలీవుడ్ క‌థానాయిక‌గా అసాధార‌ణమైన క్రేజు పెంచుకుంది. ప్ర‌స్తుతం సౌత్‌ లో రాణి మాదేవి అనే బ‌హుభాషా చిత్రంలో న‌టిస్తోంది. ఐటెమ్‌ గాళ్‌ గా అందివ‌చ్చిన అవ‌కాశాల్ని వ‌దిలిపెట్ట‌డం లేదు. కెరీర్ బిజీలో ఉండ‌గానే అటు సౌంద‌ర్య ఉత్ప‌త్తుల కంపెనీ ప్రారంభించి భ‌ర్త డేనియ‌ల్ వెబ‌ర్‌ తో క‌లిసి బిజినెస్‌ ని ప‌రుగులు పెట్టిస్తోంది. ఎంట‌ర్‌ ప్రెన్యూర్‌ గా స‌త్తా చాటుతూ విలక్ష‌ణ‌త‌ను చాటుతోంది. ఒక పోర్న్‌ స్టార్‌ కి ఈ కంబ్యాక్ ఎంతో గొప్ప‌ది.

ఇక‌పోతే స‌న్నీ ఫ్యామిలీ లైఫ్ గురించి చెప్పుకోవాల్సి వ‌స్తే.. 2017లో నిషా కౌర్ వెబర్‌ ని ద‌త్త‌త తీసుకున్న సంగ‌తి తెలిసిందే. 21 నెల‌ల చిన్నారిగా ఉన్న‌ప్పుడు మ‌హారాష్ట్ర‌- లాతూర్‌ లో ఆ చిన్నారిని అడాప్ట్ చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఆ చిన్నారి ఎదిగేస్తోంది. స‌న్నీ కూతురు చిట్టీ 2.ఓ అంత పెంకిగా క‌నిపిస్తోంది. ఎంత‌గా అంటే మామ్‌-డాడ్‌ తో మారాం చేస్తూ ఆట‌లు ఆడుకునేందుకు ర‌మ్మంటోందిట‌.

తాజాగా స‌న్నీ- నిషాకి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. నిషాతో ఔటింగ్‌ కి వెళ్లిన‌ప్ప‌టి ఫోటోలు - అలానే మొన్న బాల‌ల దినోత్స‌వం రోజు అచ్చం త‌న కూతురులాగే రెండు పిల‌క‌లు ముడి వేసిన స‌న్నీ ఫోటోలు వెబ్‌ లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. వీళ్ల‌తో పాటు స‌రోగ‌సీ విధానంలోనూ స‌న్నీ ట్విన్ బోయ్స్‌ కి మామ్ అయిన సంగ‌తి తెలిసిందే.