Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : ప్రకృతి ఒడిలో పరువాల విందు పంచుతున్న సన్నీలియోన్..!

By:  Tupaki Desk   |   27 Oct 2022 12:52 AM GMT
ఫోటో స్టోరీ : ప్రకృతి ఒడిలో పరువాల విందు పంచుతున్న సన్నీలియోన్..!
X
ఒకానొక సమయంలో పోర్న్ స్టార్ గా వెలుగొందిన సన్నీ లియోన్ ఇప్పుడు నటిగా నిరూపించుకుంటోంది. పోర్న్ స్టార్ గా కుర్రాళ్ళ గుండెల్లో సెగలు రేపిన ఈ బ్యూటీ నటనతోనూ అదరగొడుతోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ నుంచి సన్నీ లియోన్ కు వరుస ఆఫర్లు దక్కుతున్నాయి. టాలీవుడ్లోనూ ఈ భామకు ఫుల్ క్రేజ్ ఉంది.

తెలుగులో మంచు విష్ణు సోదరుడు మనోజ్ హీరోగా నటించిన 'కరెంట్ తీగ'లో సన్నీ లియోన్ అతిథి పాత్రలో కనిపించింది. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ చేసి హాట్ హాట్ అందాలను ఆరబోసింది. ఈ మూవీలో రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా నటించగా సన్నీ లియోన్ చేసిన ఐటమ్ సాంగ్ సినిమాకే హైలెట్ గా నిలిచింది.

మంచు విష్ణు తాజా చిత్రం 'జిన్నా'లోనూ సన్నీ లియోన్ లీడ్ చేసింది. ఈ మూవీలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించగా.. సన్నీ లియోన్ చుట్టూనే కథ మొత్తం తిరుగుతూ ఉండటం విశేషం. కామెడీ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకు తొలిరోజే పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే కలెక్షన్లు మాత్రం పెద్దగా రాకపోవడం లేదని టాక్ వినిపిస్తోంది.

దీపావళి పండుగకు నాలుగైదు కొత్త సినిమాలు రావడంతో 'జిన్నా' కలెక్షన్లు పుంజుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో 'జిన్నా' సైతం మంచు విష్ణు కెరీర్లో మరో ఫ్లాప్ మూవీగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మంచు విష్ణు.. సన్నీ లియోన్ పాత్రలకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. చాలామంది కుర్రాళ్లు సన్నీ లియోన్ కోసమే ఈ చిత్రాన్ని చూసినట్లు చెప్పడం విశేషం.

సన్నీ లియోన్ సినిమాలతో ఎంత బీజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాను మాత్రం వదలడం లేదు. తన ఇన్ స్ట్రాలో హాట్ ఫొటో షూట్స్ కు సంబంధించిన పిక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. తాజాగా సన్ గ్లాసెస్ పెట్టుకొని.. జాకెట్‌ తీసేసి.. పింక్‌ బ్రాలో హోయలుబోతూ.. థైట్‌ ప్యాంట్‌లో థైస్‌ షేపులు చూపిస్తూ హీట్ పెంచుతోంది.

ప్రకృతి ఒడిలో వయ్యారాలు పోతున్న ఈ అమ్మడిని చూసి నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. సన్నీ లియోన్ ఫోటోలకు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తూ తెగ లైకులు కొడుతున్నారు. దీంతో ఈ ఫోటోలు కాస్త నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఏదిఏమైనా సన్నీ లియోన్ తనపై ఉన్న పోర్న్ స్టార్ ముద్రను క్రమంగా పొగొట్టుకుంటుడటంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.