Begin typing your search above and press return to search.

సన్నీకి అది చాలా ఇబ్బందిగా అనిపించేదట!

By:  Tupaki Desk   |   25 July 2016 4:29 AM GMT
సన్నీకి అది చాలా ఇబ్బందిగా అనిపించేదట!
X
దేశవ్యాప్తంగా యూత్ లో హాట్ టాపిక్ అనే చెప్పాలి! ప్రస్తుతం సూపర్ స్టార్ లకు సైతం తన సినిమా విడుదలతో వణుకు పుట్టిస్తోన్న సన్నీ.. కెనడాలో పుట్టిపెరిగిన భామ అనేది తెలిసిన విషయమే. తర్వాతి రోజుల్లో బాలీవుడ్ కి వచ్చి తనదైన మార్కు ఇండస్ట్రీపై వేసింది. ఇలాంటి సన్నీకి ఇండస్ట్రీకి వచ్చిన రోజుల్లో మిగిలిన విషయాల్లో పెద్ద ఇబ్బందులేమీ రాలేదట కానీ... ఒకే ఒక్క విషయంలో మాత్రం వచ్చాయట!!

అవును.. అదేమిటంటే... హిందీ బాషలో మాట్లాడటం. ఈ విషయాలపై స్పందించిన సన్నీ.. తనకు తోటి నటులతో హిందీలో మాట్లాడాలని, హిందీ నేర్చుకోవాలని ఉండేదని, అలా వీలైనప్పుడల్లా ప్రయత్నించేదాన్నని చెప్పుకొచ్చింది. ఆ క్రమంలో ఏవైనా పొరపాట్లు మాట్లాడితే మాత్రం వాటిని ఏ ఒక్కరూ సరిదిద్దేవారు కాదట.. పాపం! పైగా ఎంత ముద్దుగా హిందీ మాట్లాడుతున్నావో సన్నీ అంటూ మురిసిపోయేవారట. అయితే.. తప్పులు మాట్లాడినప్పుడు మాత్రం ఎవరూ చెప్పకపోవడంపై సన్నీ తెగబాదపడిపోతుంది.. ఆ ఒక్క విషయమే తనకు చాలా ఇబ్బందిగా అనిపించేదని చెబుతుంది.

ఇంక ఇలా కాదని నిర్ణయించుకున్న సన్నీ.. అర్బాజ్ ఖాన్ దర్శకత్వంలో నటించబోయే సినిమాకోసం ఒక హిందీ ట్యూటర్ ని నియమించుకుందట. ఇప్పటికే ఆ శిక్షణ కార్యక్రమాలు కూడా మొదలైపోయాయట. అన్నీ అనుకూలంగా జరిగితే.. మరికొన్ని రోజుల్లో సన్నీ తనదైన స్టైల్లో హిందీలో అనర్గలంగా మాట్లాడేస్తాదన్నమాట! ప్రస్తుతం సన్నీ కూడా అలానే ఆనందపడిపోతోంది. ఈ విషయంపై సన్నీకి అభిమానులు ఆన్ లైన్ లో ఆల్ ది బెస్ట్ చెప్పేస్తారేమో!!