Begin typing your search above and press return to search.
ఇంటర్యూ: పోర్న్ సినిమాల వలనే ఎటాక్
By: Tupaki Desk | 8 April 2015 11:30 AM GMTఏక్ పహేలీ లీలా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది సన్నీలియోన్. పునర్జన్మల నేపథ్యంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో సన్నీ భర్త డేనియల్ వెబర్ ఓ అతిధి పాత్రలో తళుక్కుమంటున్నాడు. ఈ సందర్భంగా సన్నీ ముచ్చటిస్తూ చాలా సంగతులే చెప్పింది.
=ఏక్ పహేలీ లీలా .. నా కెరీర్‌లో ఎంతో కీలకమైన సినిమా. ఇందులో మీరా అనే పల్లెటూరి అమ్మాయిగా నటించాను. మీరా ఆధునిక యువతి. తను లీలాగా ఎలా మారిందన్నది ఆసక్తికరం.
=లీలా పాత్ర చాలా కష్టతరమైనది. అందులో ఎన్నో ఉద్వేగాల్ని పలికించాలి. ఆ పాత్ర కోసం రోజూ ఏకంగా 6గంటలు శ్రమించాల్సొచ్చేది. మేకప్ కోసమే ఎక్కువ సమయం పట్టేది. అందుకోసం మూడు గంటలు ముందే సెట్స్‌కి హాజరయ్యేదాన్ని. ఇలా ఎంతో శ్రమిస్తే కానీ ఇప్పుడున్న లీలా మీముందుకు రాలేకపోయింది.
=లీలా రాజస్థానీ లోకల్ భాష మాట్లాడాలి. దానికోసం తీవ్రంగానే కసరత్తు చేయాల్సొచ్చింది. లీలాకి ప్రత్యేకించి ఆహార్యం ఉంటుంది. దానికోసం అక్కడి విలేజీ గాళ్‌ని పరిశీలించాను. లీలా లాగే మాట్లాడాలి. లీలా లాగే ప్రవర్తించాలి.. అన్నీ అచ్చం అలాగే అనిపించాలి. అందుకు ఎంతగానో శ్రమించాను.
=దోలీ తారో పాటలో ఓ ప్రత్యేకమైన నడక తీరు కోసం దాదాపు 12 టేకులు తినాల్సొచ్చింది. అంటే మిగతా భాగం చిత్రీకరణకు ఎంత శ్రమించాల్సొచ్చిందో అర్థం చేసుకోండి. లీలా లా మాట్లాడాలి. నడవాలి కాబట్టి మధ్య మధ్యలో కాస్త ప్రాక్టీస్ కూడా చేసేదాన్ని.
=నేను ఏదైనా స్క్రిప్టు ఓకే చేయాలంటే ముందు మా ఆయన కథ వింటాడు. నచ్చితే సినాప్సిస్ నా దగ్గరికి పంపిస్తాడు. అది చదివాక స్క్రీన్‌ప్లే అర్థం చేసుకుంటా. దాని తర్వాత ప్రాజెక్టుకి ఓకే చెబుతా.
=నలుగురూ గుమిగూడిన చోట కొంటె కుర్రాళ్లు నా వైపు అదోలా చూడడం నేను చాలా సార్లు గమనించాను. అయితే అలాంటప్పుడు నాలో నేనే నవ్వేసుకుంటా. నా గత (పోర్న్) సినిమాలన్నీ నాకు అభిమానుల్ని పెంచాయి. అందువల్ల బైటికి ఎక్కడికి వెళ్లినా నాపై ఎటాక్ ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగానే వెళుతుంటాను.
=నేను బాలీవుడ్‌కి వస్తున్నానంటే వెల్‌కమ్ చెప్పింది కండల వీరుడు సల్మాన్‌ఖాన్. అతడు గొప్ప నటుడే కాదు. అతడు ఓ గొప్ప బ్రాండ్ కూడా. ఇక్కడికి రా. నటించు అని నన్ను స్వగతించారాయన. తన సినిమాల్లో ఐటెమ్ నంబర్లలోనూ అవకాశం ఇచ్చారు.
= ఇక్కడ ఓ సారి బ్రాండ్ అనిపించుకుంటే సరిపోతుంది. నువ్వు మంచా? చెడా ? అనేది పట్టించుకోరు. అవకాశాలు వాటంతట అవే వరిస్తాయి. దటీజ్ ఇండస్ట్రీ .. అంటూ తన అనుభవాల్ని చెప్పుకొచ్చింది ఈ ఇండో కెనడియన్ బ్యూటీ.