Begin typing your search above and press return to search.

సన్నీ బిస్కట్ లు బాగానే వేయడం నేర్చుకుందే..!

By:  Tupaki Desk   |   30 July 2022 3:30 AM GMT
సన్నీ బిస్కట్ లు బాగానే వేయడం నేర్చుకుందే..!
X
సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే కొన్ని పనులు చేయాలని అంటూ ఉంటారు. కొత్త వారు సీనియర్స్ ను కాకా పట్టడం అందులో మొదటి పని. మీరు గొప్ప వారు.. మీతో వర్క్ చేయడం అదృష్టం.. జీవిత సాఫల్యం అంటూ రెండు మూడు మాటలు చెప్తే పడి పోయే వారు చాలా మంది ఉంటారు. టాలీవుడ్‌ లో ఒక సీనియర్ స్టార్‌ హీరో వద్ద దర్శకులు అలాంటి మాటలు చెప్పి ఒప్పిస్తారనే టాక్ ఉంది.

హీరోలు మరియు దర్శకులను జూనియర్ ఆర్టిస్టులు.. చిన్న హీరోయిన్స్‌.. కొత్త హీరోయిన్స్‌ కాకా పట్టే అవకాశాలు దక్కించుకుంటారు. నిర్మాతలను కూడా హీరోలు మరియు దర్శకులు కాకా పట్టడం అనేది చాలా కామన్ విషయం. బాలీవుడ్ లోనూ ఈ కాకా థీమ్‌ కొత్తేం కాదు. పార్టీ లకు వెళ్తూ అక్కడ స్టార్స్ కంట పడటం.. వారితో మాట కలిపి వారిని ఆకాశానికి ఎత్తడం వంటివి చేయాలి.

బాలీవుడ్‌ లో నటిగా అడుగు పెట్టిన సన్నీ లియోన్‌ కు పద్దతులు బాగానే వంట బట్టినట్లున్నాయి. బాలీవుడ్ నీరు వంట బట్టి కాకా పట్టడం మొదలు పెట్టింది. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడికి పెద్దగా ఆఫర్లు రావడం లేదు. దాంతో ఆఫర్ల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఈ సమయంలో ఈ అమ్మడికి అనురాగ్ కశ్యప్ నుండి ఆఫర్ వచ్చింది.

అనురాగ్‌ కశ్యప్ సినిమాలో ఎంపిక అయిన సన్నీలియోన్ ఆసక్తికర పోస్ట్‌ ను సోషల్ మీడియాలో షేర్‌ చేసింది. అందులో... అనురాగ్ కశ్యప్ డైరెక్షన్ లో నటించాలన్న నా కల ఎట్టకేలకు నెరవేరింది. ఆయన తన సినిమాలో అవకాశం ఇస్తాడని నేను ఎప్పుడు భావించలేదు.

ఇండస్ట్రీలో నా ఇన్నాళ్ల ప్రయాణం అద్భుతంగా సాగినప్పటికి అనురాగ్‌ కశ్యప్ దర్శకత్వంలో సినిమా చేయలేదనే లోటు ఉండేది. ఇప్పుడు ఆ లోటు కూడా తీరబోతుందని సన్నీ లియోన్ ఆనందంగా చెప్పుకొచ్చింది. ఈ బిస్కట్స్ కు అనురాగ్‌ ఫుల్‌ గా హ్యాపీ అయ్యి ఉంటాడు సన్నీ.. ఇక చాలు అంటూ ఫన్నీగా సోషల్‌ మీడియాలో జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

ఇలాగే మరికొందరికి కూడా బిస్కట్స్ వేసినట్లుగా మాట్లాడితే మరి కొంత కాలం నీ కెరీర్‌ కు ఎలాంటి ఢోకా లేదంటూ నెటిజన్స్ సన్నీకి సలహా ఇస్తున్నారు. కేవలం సన్నీ మాత్రమే కాకుండా నటీ నటులు దాదాపు అంతా కూడా ఇలా ఎక్కడో ఒక చోట కాకా పట్టేవారే.. పడుతున్న వారే.