Begin typing your search above and press return to search.

సన్నీలియోన్ వారి ఫ్లాట్ 50% డిస్కౌంట్ సేల్

By:  Tupaki Desk   |   15 Oct 2019 10:01 AM IST
సన్నీలియోన్ వారి ఫ్లాట్ 50% డిస్కౌంట్ సేల్
X
వెండితెర వేల్పులు నటనను మాత్రమే నమ్ముకోవటం లేదు. తమకున్న ఇమేజ్ ను వారు బిజినెస్ రూపంలో మళ్లిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖ నటీమణులు తమ అభిరుచికి తగ్గట్లు వ్యాపారాలు చేస్తుంటారు. అయితే.. తమ కమర్షియల్ యాక్టివిటీస్ కు సంబంధించి.. తమ ఉత్పత్తుల్ని ప్రీమియం ధరలకే అమ్ముతారు తప్పించి.. డిస్కౌంట్ సేల్ లాంటి వాటిపైన మక్కువ చూపరు.

ట్రెండ్ కు భిన్నంగా వ్యవహరిస్తూ.. తనను తానే ఒక ట్రెండ్ గా భావించే బాలీవుడ్ నటి సన్నీ లియోన్.. వ్యాపారంలోనూ తాను కాస్త భిన్నంగా వ్యవహరిస్తానని తేల్చేసింది. భారీ అందాలతో మతులు పోగొట్టటమేకాదు.. యువతకు నిద్ర లేకుండా చేసే సన్నీలియోన్.. సినిమాలతో పాటు బ్యూటీకేర్ ఉత్పత్తుల్ని ఆన్ లైన్ లో అమ్ముతుంటుంది.

ఇందులో లిప్ స్టిక్.. ఐ డిఫైనర్.. మేకప్ కిట్.. పెర్ ఫ్యూమ్ లాంటి ఎన్నో ఉత్పత్తులు లభిస్తాయి. suncitystore.com పేరుతో ఆమె నిర్వహించే ఆన్ లైన్ షాపింగ్ కు సంబంధించి ఫిస్టివల్ సీజన్ లో తన అభిమానులకు తాను ఇచ్చే కానుకగా ప్లాట్ 50% డిస్కౌంట్ ను ప్రకటించారు. కేవలం రెండు రోజులు మాత్రమే ఉండే ఈ రాయితీని ఊరించే రీతిలో ట్వీట్ సందేశంలో పోస్ట్ చేసి.. తనలోని బిజినెస్ ఉమెన్ ను బయటకు తీసుకొచ్చారు సన్నీ లియోన్.