Begin typing your search above and press return to search.

బాలయ్య సెంచరీలో స్పైస్ పెరిగిందా?

By:  Tupaki Desk   |   3 April 2016 4:00 AM GMT
బాలయ్య సెంచరీలో స్పైస్ పెరిగిందా?
X
నందమూరి బాలకృష్ణ సెంచరీ కొట్టడానికి సిద్ధం అయిపోతున్నారు. ఉగాది రోజున తన వందో సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు బాలయ్య. ఇప్పటికే ఈ ల్యాండ్ మార్క్ మూవీకి సంబంధించి టాలీవుడ్ లో ఓ క్లారిటీ ఉంది. క్రిష్ డైరెక్షన్ లో యోధుడు టైటిల్ పై గౌతమీ పుత్ర శాతకర్ణిగా నటించనున్నారని తెలుస్తోంది. ఇప్పుడీ మూవీకి సంబంధించి ఓ హాట్ గాసిప్ వినిపిస్తోంది.

యోధుడు చిత్రంలో ఓ కీలకమైన రోల్ కోసం సన్నీలియోన్ ని సంప్రదించారని తెలుస్తోంది. బాలయ్య మూవీలో సన్నీకి ఆఫర్ చేసినది నెగిటివ్ రోల్ అంటున్నారు. విష కన్యగా సన్నీ లియోన్ ని చూపించేందుకు ప్రయత్నిస్తున్నాడట దర్శకుడు. ఇప్పటికే ఈ పాత్ర కోసం పోర్న్ స్టార్ ని అడిగినట్లు తెలుస్తోంది. ఇంతకు మించిన హాట్ న్యూస్ ఏంటంటే.. యోధుడులో సన్నీకి ఓ ఐటెం సాంగ్ కూడా ఉంటుందని తెలుస్తోంది.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించే సినిమాలో ఐటెం నెంబర్స్ అంటే ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. ఒకవేళ సన్నీ పై వచ్చిన రూమర్ నిజమే అయితే.. బాలయ్య హీరో - డీఎస్పీ మ్యూజిక్ - సన్నీలియోన్ డ్యాన్స్.. ఈ సూపర్ కాంబినేషన్ చూసే ఛాన్స్ ఫ్యాన్స్ కు దక్కుతుంది.