Begin typing your search above and press return to search.
బెంగుళూరుకు సారీ చెప్పేసిన సన్నీ!!
By: Tupaki Desk | 20 Dec 2017 4:35 AM GMTఅసలు న్యూ ఇయర్ కు స్వాగతం పలుకుతూ బెంగుళూరులో జరగబోయే ఆ ఈవెంటులో సెక్సిణి సన్నీ లియోన్ నృత్యాలు చేస్తోందా? లేదా? దీనిపై ఎవరికి ఎలాంటి సందేహం ఉన్నా కూడా.. ఇప్పుడు మన పంజాబీ సుందరి మాత్రం అన్నింటినీ పటాపంచలు చేసింది. బెంగుళూరు పోలీసులు అంత డైరక్టుగా చెప్పాక.. నాకు అక్కడికి రావాల్సిన అవసరం ఏముందంటూ.. కాస్త సున్నితంగా సెటైర్ వేసింది.
నిజానికి బెంగుళూరులో సన్నీలియోన్ డిసెంబర్ 31కి డ్యాన్స్ చేస్తోంది అంటే.. అదేమాత్రం పబ్లిక్ లో ఒక స్టేజీ ఎక్కేసి చేసే నాట్యం కాదు. ఒక కంపెనీ వారి ఆడిటోరియంలో లేదంటే ఒక ఫైవ్ స్టార్ రిసార్టులు.. వారి కంపెనీ ఎంప్లాయిస్ సమక్షంలో జరిగే ఒక కార్యక్రమం. అయినాసరే కర్ణాటక పోలీసులు బాగా అత్యుత్సాహం ప్రదర్శించి.. మొన్న కేరళలో షాపు ఓపెనింగుకు సన్నీ వచ్చినప్పుడు అస్సలు జనాలను కంట్రోల్ చేయడం ఎవరి తరం కాలేదని.. ఇప్పుడు కూడా కష్టమని.. ఒకవేళ సన్నీ వస్తే మేము సెక్యురిటీ ఇవ్వలేం అంటూ వారు పేర్కొన్నారు. దీనిపై ఎట్టకేలకు స్పందించిన సన్నీ.. 'నాకు నా టీమ్ తో పాటుగా ప్రజల శ్రేయస్సు కూడా ముఖ్యం. పోలీసులు సెక్యురిటీ ఇవ్వలేకపోతున్నారు కాబట్టి. నేను అక్కడికి రావట్లేదు' అంటూ ట్వీటేసింది.
సన్నీ సింపుల్ గా సారీ చెప్పింది కాని.. ఒక నటీమణి కాన్సర్టు కోసం సెక్యురిటీ ఇవ్వలేం అని చెప్పడం పోలీసుల చేతకాని తనం అంటూ నెటిజన్లు ఆమెకు బాసటగా నిలుస్తున్నారు. వారి చేసిన ట్వీట్లన్నీ సన్నీ రీ-ట్వీట్ చేస్తూ.. ఓ రకంగా కర్ణాటక రాష్ట్రాన్ని.. కన్నడ పోలీసులను ఆడుకుంటోంది.