Begin typing your search above and press return to search.

నాయుడితో పెళ్ళి.. సన్నీ లియోన్ కేక

By:  Tupaki Desk   |   13 Dec 2016 5:30 AM GMT
నాయుడితో పెళ్ళి.. సన్నీ లియోన్ కేక
X
సన్నీ లియోన్ ఎప్పుడు కనిపించినా అందాలు ఆరబోస్తూ కనిపిస్తుంది. ఆమె అందాలను చూసేందుకు థియేటర్లకు వచ్చే జనాలను ఏమాత్రం నిరుత్సాహపరచకుండా ఉండేలా నిర్మాతలు ప్లాన్ చేస్కుంటారు. బైట ప్రమోషన్స్.. ఫోటోషూట్స్ కూడా ఈ బాపతుగానే ఉంటాయి. కానీ సన్నీ ఒక్కసారిగా సాంప్రదాయ వస్త్రాల్లోకి మారిపోయి ఏకంగా పెళ్లి పెద్ద అయిపోయింది.

సన్నీ లియోన్ కి సందీప్ వోహ్రా అనే సోదరుడు ఉన్నాడు. ఇతను అమెరికాలో చెఫ్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతనికి తాజాగా కరిష్మా నాయుడు అనే యువతితో పెళ్లి జరిగింది. ఈమె ఓ స్టైలిస్ట్ కాగా.. ఇద్దరి వివాహాన్ని సన్నీ లియోన్-ఆమె భర్త డానియెల్ వెబర్ లు పెళ్లి పెద్దలుగా మారి జరిపించారు. ఈ పెళ్లి కోసం సన్నీ సంప్రదాయ సిక్కు వస్త్రధారణలోకి మారిపోయి రచ్చరచ్చ చేసేసింది. ఆమె భర్త కూడా సేమ్ అదే టైపు గెటప్ లోకి వచ్చేశాడు.

ఇప్పటికే సన్నీ సోదరుడు సందీప్.. కరిష్మాలు కూడా ఇండియా వచ్చేసి సెటిల్ అయిపోయారట. వీళ్లు సన్నీలియోన్ నిర్వహించే పలు వ్యాపార కార్యకలాపాలతో పాటు ప్రొఫెషనల్ యాక్టివిటీస్ ను దగ్గరుండి చూసుకుంటారట. మొత్తానికి సన్నీ ఫ్యామిలీ అంతా ఇండియాలో బాగానే మకాం వేసేస్తోంది. వచ్చిన క్రేజ్ ని ఆ మాత్రం ఉపయోగించుకోవడంలో తప్పు లేదులే!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/