Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: వాట్ ఎ ఛేంజ్

By:  Tupaki Desk   |   4 Sep 2019 4:28 AM GMT
ఫోటో స్టొరీ: వాట్ ఎ ఛేంజ్
X
ఈ ప్రపంచంలో శాశ్వతమైన విషయం.. సత్యం ఏదైనా ఉంది అంటే అదొక్కటే... 'మార్పు'. ఇంగ్లీష్ లో 'ఛేంజ్ ఈజ్ కాన్స్టెంట్' అనే కొటేషన్ కూడా ఉంది. చాలామంది ఒప్పుకోరు కానీ.. ఆ ఒప్పుకోని వారు కూడా నెమ్మదిగా మారిపోతారు. ఒక పదేళ్ళ క్రితం బెస్ట్ అనిపించిన విషయం ఈరోజు మనకు బెస్ట్ అనిపించకపోవచ్చు. అప్పట్లో అదే జీవితం అనుకున్న విషయం ఈరోజు చాలా బోరింగ్ అనిపించవచ్చు. ఇవన్నీ పక్కన పెడితే పదేళ్ళ క్రితం మనం ఎలా ఉన్నామో ఇప్పుడు అలా ఉండము. ఎవరైనా ఇంకా 'అలానే ఉన్నాను' అంటే అది పక్కాగా అబద్ధమే. సరే.. భారతీయులు అదేపనిగా గూగుల్ లో సంవత్సరాల తరబడి వెతికి గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ లో నంబర్ 1 స్థానం ఇచ్చిన సన్నీ లియోన్ కూడా అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలా లేదు. సన్నీ కూడా మారిపోయింది.

పోర్న్ తారగా తన కెరీర్ ను మొదలు పెట్టిన సన్నీ లియోన్ ఇప్పుడు పోర్న్ తార కాదు. మరి గూగుల్ లో 'సన్నీ లియోన్' అని టైప్ చేస్తే వెంటనే ట్రిపుల్ ఎక్స్ వీడియోస్ వస్తాయి కదా అని అడగవచ్చు. కానీ అవి కొత్తవి కాదు. మారిపోయిన సన్నీ లియోన్ వి కాదు. పాత సన్నీ లియోన్ వి. సన్నీ లియోన్ ఇప్పుడు శ్రీమతి సన్నీ లియోన్. డేనియల్ వెబర్ ను వివాహం చేసుకుని నిషా అనే ఒక పాప ను దత్తత తీసుకుని.. మరో ఇద్దరు పిల్లలకు సరోగసీ విధానంలో తల్లిగా మారిన ఒక మహిళ. ఇప్పుడు బాలీవుడ్ నటిగా కెరీర్ కొనసాగిస్తోంది. 'స్టార్ స్ట్రక్' అనే బ్రాండ్ తో కాస్మెటిక్స్ బిజినెస్ కూడా చేస్తోంది.

రీసెంట్ గా సన్నీ తన కుటుంబంతో వినాయక చవితి జరుపుకుంది. భర్త వెబర్.. పిల్లలు నిషా.. అషర్.. నోవాలతో గణేష్ పూజలో పాల్గొని.. అందరితో కలిసి ఫోటోకు పోజిచ్చింది. సన్నీ లియోన్ అనగానే ఏవేవో ఊహించుకుంటారు జనాలు. కానీ ఈ ఫోటోలో అవేవీ లేవు. అలాంటి వాటిని వర్ణించడానికి వాడే పదాలను ఉపయోగించే అవసరం కూడా ఈ ఆర్టికల్ లో రాలేదు. నేపథ్యంలో విఘ్న నాయకుడైన వినాయకుడు.. పక్కనే ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమించే భర్త.. ఒళ్ళో రత్నాల్లాంటి పిల్లలు. దిస్ ఈజ్ కాల్డ్ 'మార్పు'.. 'నిజమైన మార్పు'.