Begin typing your search above and press return to search.

సన్నీకి రావాల్సిన ఛాన్స్ కొట్టేసిన కాజల్

By:  Tupaki Desk   |   7 Aug 2020 7:30 AM GMT
సన్నీకి రావాల్సిన ఛాన్స్ కొట్టేసిన కాజల్
X
ద‌శాబ్ధం పైగా కెరీర్ లో ఏనాడూ హ‌ద్దు మీరి అందాల్ని ఎక్స్ పోజ్ చేయ‌లేదు కాజ‌ల్. చంద‌మామ‌ను త‌ల‌పించేలా ఎంతో ప‌ద్ధ‌తిగానే క‌నిపించింది. టూమ‌చ్ బోల్డ్ క్యారెక్ట‌ర్ల‌ను అంగీక‌రించ‌కుండా ... ఏమేర‌కు అందాల ప్ర‌ద‌ర్శ‌న అవ‌స‌ర‌మో ఆ హ‌ద్దుల్ని మెయింటెయిన్ చేసింది. అందుకే ఇప్ప‌టికీ కాజ‌ల్ అంటే క్రేజు చెక్కు చెద‌ర‌లేదు. త‌న‌కు తానుగానే కాద‌నుకోవాలి త‌ప్ప త‌న‌కు ఆఫ‌ర్ ఇవ్వ‌ను అన్న‌వాళ్లే లేరు.

ప్ర‌స్తుతం అందాల చంద‌మామ `భార‌తీయుడు 2`లో క‌మ‌ల్ హాస‌న్ స‌ర‌స‌న న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా నుంచి త‌ప్పుకుంద‌ని ప్ర‌చార‌మైనా ఆ త‌ర్వాత కాజ‌ల్ ఆ వార్త‌ల్ని ఖండించింది. ఫ్రెండు ర‌కుల్ తో క‌లిసి స్క్రీన్ ని షేర్ చేసుకుంటోంది. ఇక ఈ మూవీలో కాజ‌ల్ అందాల్ని కాస్త ఘాటుగానే చూపించేందుకు శంక‌ర్ ప్లాన్ చేశార‌ట‌. శంక‌ర్ శైలిలోని పాట‌ల్లో కాస్త గ్లామ‌ర్ డోస్ ఎక్కువే క‌నిపించే వీలుంద‌ని క‌థ‌నాలొచ్చాయి.

అదంతా స‌రే కానీ.. మ‌హ‌మ్మారీ క్రైసిస్ లో ఈ మూవీ షూటింగుకి సంబంధించి స‌రైన అప్ డేట్ ఏదీ లేదు. ఈలోగానే స్వీయ‌నిర్భంధంలో క‌థ‌లు వింటున్న కాజ‌ల్ తాజాగా ఓ సినిమాకి సంత‌కం చేసింద‌ట‌. ఈసారి ఆఫ‌ర్ టూమ‌చ్ బోల్డ్ క్యారెక్ట‌ర్ అని తెలిసింది. సన్నీ కి రావాల్సిన ఛాన్స్ కొట్టేసిన కాజల్..! అంటూ ప్ర‌చారం హీటెక్కిస్తోంది. తాజాగా ఓ తమిళ్ అడల్ట్ కామెడి లో నటించడానికి కాజల్ ఒప్పుకుంది. అయితే ఇందులో సన్నీలియోన్ ది కీలక పాత్రట. ఐతే ఈ కథ విన్న కాజల్.. మెయిన్ లీడ్ రోల్ కాకుండా సన్నీ రోల్ చేస్తాను అని చెప్పడం తో మేకర్స్ ఇప్పుడు కాజల్ కే ఆ పాత్ర ఇచ్చినట్లు తెలిసింది. కెరీర్ ఎండింగ్ లో ఆడియెన్ కి హాట్ హాట్ గా విందు ఇవ్వడానికి కాజల్ బాగానే రెడీ అవుతోంద‌న్న‌మాట‌.