Begin typing your search above and press return to search.

భర్తను ఒక ఆట ఆడేసిన సన్నీ

By:  Tupaki Desk   |   7 Oct 2021 10:30 AM GMT
భర్తను ఒక ఆట ఆడేసిన సన్నీ
X
ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత.. దాని నుంచి బయటకు రావటం అంత తేలికైన విషయం కాదు. అందులోకి కొందరికి మాత్రమే పరిమితమన్న చెడ్డ పేరుతో ఎంట్రీ ఇచ్చి.. తన మాటలతో.. చేతలతో అందరికి ఆమోదయోగ్యంగా మారటం కొందరికి మాత్రమే సాధ్యం. సల్మాన్ ఖాన్ ను చూసేందుకు హిందీ బిగ్ బాస్ షోకి వచ్చి.. పెను సంచలనంగా మారటమే కాదు.. తనకున్న పాత ఇమేజ్ తో అందరి నోట నానిన నటి సన్నీ లియోని.

పెద్దల సినిమాల్లో నటించిన ఆమె వ్యవహారం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ షోతో భారత్ కు.. బాలీవుడ్ కు ఇట్టే కనెక్టు అయిన ఆమె.. చాలా త్వరగానే తనకున్న ఇమేజ్ ను పోగొట్టుకొని మిగిలిన సెలబ్రిటీల మాదిరి మారారు. దీనికి తోడు తనలోని మార్పును ఆమెఅందరికి అర్థమయ్యేలా సక్సెస్ అయ్యారు. ఆమె మీద నెగిటివ్ ఫీలింగ్ ఉన్న వారు సైతం పాజిటివ్ అయ్యేలా ఆమె తీరు ఉండటం మరో సానుకూలాంశంగా చెప్పాలి.

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆమె.. తాజాగా ఒక ఫన్నీ వీడియోను షేర్ చేశారు. భర్త డేనియల్ వెబర్ తో ఆమె చేసిన ఫ్రాంక్ వీడియో ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది. తాళ్లతో కలిసి వాటర్ బాటిళ్లను రెండు చేతులకు కట్టేసింది. అనంతరం రెండు చేతుల మీద స్టీల్ గిన్నె.. పుస్తకాలు ఒకటి తర్వాత ఒకటి పెడుతూ.. ఫర్లేదా? ఈ బరువును మోస్తావా? అని అడగటం..

అతను ఫర్లేదనటం వరకు ఓకే. అనంతరం పిండి ఉన్న క్లాత్ ను పెట్టింది.మరింత బరువు మోయగలనన్న వేళ.. అతడు చూడకుండా కత్తెరతోతాళ్లు కట్ చేయటం.. ఒక్కసారి పిండి మొత్తం ముఖం మీద పడటం.. కామెడీగా ఉంది. ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి.. అందరి ముఖాల్లోనవ్వులు చిందిలే చేస్తోంది. ఈ వీడియోకు అందరు పాజిటివ్ గా స్పందిస్తూ లైకులు.. కామెంట్లు పెడుతున్నారు.