Begin typing your search above and press return to search.

`బాహుబ‌లి- 3` ట్విస్టు ఊహాతీతం

By:  Tupaki Desk   |   5 April 2019 7:03 AM GMT
`బాహుబ‌లి- 3` ట్విస్టు ఊహాతీతం
X
బాహుబ‌లి ఫ్రాంచైజీలో రెండు సినిమాలు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాల‌ ప్ర‌చారంలో ఆర్కా మీడియా, రాజ‌మౌళి అంత‌ర్జాతీయ వేదిక‌ల్ని ఎంచుకుని ఎంత‌టి విజ‌యం సాధించారో తెలిసిందే. రెండు భాగాలు క‌లిపి ఏకంగా 2200 కోట్లు (జపాన్ క‌లిపి) వ‌సూలు చేశాయి. కేవ‌లం బాక్సాఫీస్ విజ‌య‌మే కాదు ఈ చిత్రంలో పాత్ర‌ల గురించి దేశ‌విదేశాల్లో జ‌నాలు ఎంతో క్రేజీగా మాట్లాడుకున్నారు. బాహుబ‌లి- భ‌ళ్లాల‌దేవ‌- శివ‌గామి- క‌ట్టప్ప పాత్ర‌ల గురించి విదేశాల్లోనూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది.

ఈ ఫ్రాంఛైజీలో బాహుబ‌లి 3 తెర‌కెక్కిస్తే అందులో నేను కూడా న‌టిస్తాన‌ని అవెంజ‌ర్స్ స్టార్ .. ప్ర‌ఖ్యాత హాలీవుడ్ న‌టుడు శ్యామ్యుల్ జాక్స‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అవెంజ‌ర్స్ ఇండియా రిలీజ్ గురించి మాట్లాడుతూ బాహుబ‌లి ఫ్రాంఛైజీపై ఆయ‌న‌ ఆస‌క్తిని క‌న‌బ‌రిచారు. అంత‌కుముందు 2018 సెన్సేష‌న‌ల్ హాలీవుడ్ మూవీ `బ్లాక్ పాంథ‌ర్` లో న‌టించిన‌ స్టార్లు బాహుబ‌లి గురించిన ప్ర‌స్థావ‌న తేవ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది.

తాజాగా `బాహుబ‌లి- 3` పోస్ట‌ర్ అంటూ ఐపీఎల్ క్రికెట‌ర్లు ప్ర‌స్థావించ‌డం మ‌రోమారు అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఐపీఎల్ ఫ్రాంఛైజీలో హార్డ్ హిట్టింగ్ ప్లేయ‌ర్స్ గా పేరున్న వార్న‌ర్, విలియ‌మ్స‌న్ బాహుబ‌లి 3లో న‌టించాల‌నుంద‌ని ఆస‌క్తిని క‌న‌బ‌ర‌చ‌డంతో అభిమానుల్లో వేడెక్కించే చ‌ర్చ సాగుతోంది. సినిమాల్లో న‌టించాల‌నుకుంటే ఏ సినిమాలో న‌టిస్తారు? అని స‌న్ రైజ‌ర్స్ ప్లేయ‌ర్స్ వార్న‌ర్, విలియ‌మ్స‌న్ ల‌ను ప్ర‌శ్నిస్తే అట్నుంచి వినిపించిన ఏకైక స‌మాధానం `బాహుబ‌లి`. మొత్తానికి హాలీవుడ్ లోనే కాదు, వ‌ర‌ల్డ్ క్రికెట్ లోనూ బాహుబ‌లి క్రేజు ఏంటో దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ఈ సిరీస్ లో` బాహుబ‌లి 3` తెర‌కెక్కించేందుకు రాజ‌మౌళి ఆస‌క్తిగా ఉన్నారా? అంటే ఆర్.ఆర్.ఆర్ పూర్త‌యితే కానీ చెప్పలేం. 2020 జూలై 30న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ కానుంది.