Begin typing your search above and press return to search.

మలేషియాలో క్రేజీ సినిమాల బ్యాన్

By:  Tupaki Desk   |   5 April 2019 6:41 AM GMT
మలేషియాలో క్రేజీ సినిమాల బ్యాన్
X
ఇటీవలే తమిళ్ లో విడుదలైన సూపర్ డీలక్స్ పేరుకు తగ్గ టాక్ తో దూసుకుపోతోంది. విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఆదరణ దక్కుతోంది. హైదరాబాద్ విజయవాడ లాంటి కీలక కేంద్రాల్లో రిలీజ్ చేయడంతో భారీ వసూళ్లు దక్కుతున్నాయని ట్రేడ్ రిపోర్ట్. ఇదిలా ఉండగా తమిళ్ సినిమాలకు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చే మలేషియాలో సూపర్ డీలక్స్ బ్యాన్ కు గురైంది.

ఇందులో ఉన్న కంటెంట్ సున్నితమైన విషయాలను కలిగి ఉండటంతో పాటు అక్కడి చట్టాలకు అనుగుణంగా లేని అంశాలను జోడించడంతో దీనికి అనుమతి ఇవ్వలేమని అధికారులు తేల్చి చెప్పడంతో సూపర్ డీలక్స్ కు అక్కడ బ్రేక్ పడిపోయింది. అయితే ఇలా నిషేదానికి ఈ మధ్యకాలంలో గురైన సినిమా ఇదొక్కటే కాదు

ఇంతకుముందు ఒవియా నటించిన 90 ఎంఎల్ ను ఇదే కారణంగా రిలీజ్ కు నో చెప్పారు. హద్దులు మీరిన బూతులు విచ్చలవిడితనం ఉండటం వల్ల 90 ఎంఎల్ నిర్మాతలు ఎంత ప్రయత్నించినా విడుదల సాధ్య పడలేదు. కమల్ హాసన్ సోదరుడు సీనియర్ ఆర్టిస్ట్ చారుహాసన్ దాదా 87కు సైతం ఇదే ట్రీట్మెంట్ తప్పలేదు. విచిత్రంగా ఈ సినిమాలేవీ తెలుగులో డబ్ కాలేదు.

వీటిలో స్టార్స్ ఎవరూ లేకపోవడం వల్ల ఇక్కడికి తీసుకొచ్చే సాహసం చేయలేదు. కాని సూపర్ డీలక్స్ లో సమంతా రమ్యకృష్ణ లాంటి నోటెడ్ తెలుగు ఆర్టిస్టులు ఉన్నారు. అయినా అనువదించే సూచనలు దగ్గరలో కనిపించడం లేదు. అదలా ఉంచితే ఎంత బరితెగించిన కంటెంట్ ఉన్నా ఏ సర్టిఫికేట్ ఇచ్చి చేతులు దులుపుకునే మన వ్యవస్థ కన్నా మొహమాటం లేకుండ బ్యాన్ చేసి పారేసే మలేషియా చట్టాలే స్ట్రాంగ్ గా ఉన్నట్టున్నాయి