Begin typing your search above and press return to search.

సూపర్‌ హిట్‌ మూవీ ఓటీటీ అప్డేట్‌ వచ్చింది

By:  Tupaki Desk   |   20 Dec 2022 6:14 AM GMT
సూపర్‌ హిట్‌ మూవీ ఓటీటీ అప్డేట్‌ వచ్చింది
X
అడవి శేష్‌ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ 2 సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. యూఎస్ లో మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేసిన హిట్‌ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఊహించినదాని కంటే కూడా ఎక్కువ వసూళ్లు రాబట్టింది. హిట్‌ 2 సినిమా తో మరోసారి అడవి శేష్‌ సక్సెస్ ను దక్కించుకున్నాడు.

హిట్ 2 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఓటీటీ లో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ప్రేక్షకులు వెయిట్‌ చేస్తున్నారు. ఓటీటీ లో హిట్‌ 2 కి సంబంధించిన అప్‌డేట్‌ వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌ వారు ఈ సినిమాను కొనుగోలు చేసిన విషయం గతంలో వెల్లడి అయింది. తాజాగా స్ట్రీమింగ్‌ తేదీపై క్లారిటీ వచ్చింది.

అమెజాన్ లో ఈ సినిమా ను జనవరి మొదటి వారంలో అందుబాటులో ఉంచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. డిసెంబర్‌ 2వ తారీకున విడుదల అయిన హిట్‌ 2 ను నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసే విధంగా అమెజాన్ డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.

నాని నిర్మాణంలో వచ్చిన హిట్‌ 2 కు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో అతి త్వరలోనే హిట్‌ 3 ఉండబోతుందని క్లారిటీ వచ్చింది. హిట్‌ 3 సినిమా లో నాని ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. శైలేష్ కొలను ఆ సినిమాను రూపొందించబోతున్నాడు. హిట్ సినిమా హిందీలో రీమేక్ అయ్యి నిరాశ పరిచింది. అందుకే హిట్‌ 2 ను హిందీలో రీమేక్ చేసే ఆలోచన లేదని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.