Begin typing your search above and press return to search.

సూపర్ స్టారే కానీ సో సెన్సిటివ్!

By:  Tupaki Desk   |   17 Feb 2020 7:30 AM GMT
సూపర్ స్టారే కానీ సో సెన్సిటివ్!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈమధ్య తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో కొన్ని వ్యక్తిగత ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తను ఇలా ఉండడానికి కారణం తన కుటుంబమేనని చెప్పారు. మీరు షై గా ఉంటారా లేదా ఎక్స్ ట్రావర్టా అని అడిగితే 'షై' అని సమాధానం ఇచ్చారు.

మీకు ప్రేరణనిచ్చే నటుడు ఎవరు అని ప్రశ్నిస్తే 'మా నాన్నగారు' అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ కంటే నిజంగా ప్రేరణ ఎవరుంటారు చెప్పండి? ఇక డ్రెస్ విషయంలో ఎలాంటివి ఇష్టపడతారు అంటే 'క్యాజువల్స్' అని చెప్పారు. క్లాస్ లేదా మాస్ అని అడిగినప్పుడు 'రెండూ' అని చెప్పారు. మీరు టఫ్ గా ఉంటారా.. సెన్సిటివ్ గా ఉంటారా అని అడిగితే 'సెన్సిటివ్' అని జవాబిచ్చారు. ఇప్పటి పరిస్థితుల్లో సెన్సిటివ్ గా ఉండడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఈ సమాజం.. చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడూ మన రక్తం తాగేందుకు సిద్ధంగా ఉంటాయి. మన తప్పు ఉన్న లేకపోయినా మనల్ని పీక్కు తింటూ ఉంటారు. ఇక జయాపజయాల సంగతి సరేసరి. ఇవన్నీ సున్నిత మనస్కులకు ఇబ్బంది కలిగించే అంశాలే. మరీ మన సూపర్ స్టార్ అంత సున్నితంగా ఉంటే కష్టం కదా?

సినిమాల విషయానికి వస్తే మహేష్ తదుపరి చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వం లో తెరకెక్కనుంది. మహేష్ ప్రస్తుతం తన కుటుంబం తో కలిసి అమెరికా వెకేషన్లో ఉన్నారు. ఇండియా తిరిగి రాగానే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని సమాచారం.