Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ చిన్నప్పటి చేతు జ్ఞాపకం
By: Tupaki Desk | 12 July 2021 10:31 AM GMTకోలీవుడ్ లో రజినీకాంత్ తర్వాత ప్రస్తుతం సూపర్ స్టార్ ఎవరు అంటే ఠక్కున వినిపించే పేరు విజయ్. గత కొన్ని సంవత్సరాలుగా తన ప్రతి సినిమాతో వందల కోట్లు వసూళ్లు సాధిస్తున్న విజయ్ ప్రస్తుతం సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల జాబితాలో ముందు వరుసలో నిలిచాడు. అంతటి సూపర్ స్టార్ అయిన విజయ్ ప్రస్తుతం తెలుగు లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. టాలీవుడ్ లో విజయ్ చేయబోతున్న సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించబోతుండగా దిల్ రాజు నిర్మించబోతున్నాడు. పాన్ ఇండియా స్టార్ గా మారిపోతున్న విజయ్ చిన్నతనంలో ఎదుర్కొన్న ఒక చేదు జ్ఞాపకంను ఆయన తల్లి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఆమె మాట్లాడుతూ.. విజయ్ తర్వాత మాకు ఒక పాప జన్మించింది. ఆ పాపకు విద్య అని పేరు పెట్టాం. విజయ్ స్కూల్ కు వెళ్లి వచ్చిన వెంటనే విద్యతో ఎక్కువ సమయంను గడిపేవాడు. చెల్లిపై చిన్నతనంలోనే చాలా ప్రేమ పెంచుకున్నాడు. రెండేళ్ల వయసులో విద్య మృతి చెందింది. ఆ సమయంలో విజయ్ డిప్రెషన్ కు వెళ్లి పోయాడు. ఆ సమయంలో ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండే వాడు. ఏడాది పాటు విజయ్ చాలా మూడీగా ఉంటూ ఏ ఒక్క విషయంలో కూడా పూర్తిగా దృష్టి పెట్టేవాడు కాదు. కాని ఎప్పుడైతే విజయ్ సినిమాలపై ఆసక్తి కనబర్చడం మొదలు పెట్టాడో అప్పటి నుండి చెల్లి గురించి ఆలోచించడం తగ్గించాడు.
సినిమాల్లో ఎక్కువగా గడపడం చూడటం వంటి కారణాలతో చెల్లి జ్ఞాపకాల నుండి బయట పడ్డాడు. అతడి జీవితంలో అదో మరిచి పోలేని సంఘటన అంటూ ఆమె చెప్పుకొచ్చారు. విజయ్ సోదరి విద్య అనారోగ్యంతో మృతి చెందింది. ఇప్పుడు ఆమె ఉండి ఉంటే చాలా బాగుండేది.. విజయ్ తన చెల్లి విషయంలో ఎంతో బాధ్యతతో మెలిగేవాడు అంటూ ఆమె చెప్పుకొచ్చారు.