Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్‌ ఫ్యామిలీ.. క్యూట్ సెల్ఫీ

By:  Tupaki Desk   |   11 Oct 2022 7:30 AM GMT
సూపర్ స్టార్‌ ఫ్యామిలీ.. క్యూట్ సెల్ఫీ
X
సూపర్ స్టార్‌ మహేష్ బాబు ఫ్యామిలీ టాలీవుడ్‌ లోని మోస్ట్‌ బ్యూటీ ఫుల్‌ ఫ్యామిలీస్ లో ఒకటి అనడంలో సందేహం లేదు. నమ్రత రెగ్యులర్ గా ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటారు. తాజాగా నమ్రత తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉన్న ఈ సెల్ఫీ ని సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. ఆమె షేర్ చేసిన ఈ పోటో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

ఈ ఫోటో లో నమ్రత మరియు సితార ఎంతో క్యూట్‌ గా నవ్వుతూ ఉంటే గౌతమ్ ఎప్పటి మాదిరిగానే మహేష్ బాబు మాదిరిగా కాస్త నవ్వు మొహంతో చూస్తూ ఉన్నాడు. గౌతమ్‌ కు ఇలాంటివి ఇంకా ఇష్టం అయినట్లుగా లేవు అనిపిస్తుంది అంటూ కామెంట్స్ కామెంట్స్ చేస్తున్నారు. అతడు ఎలా ఉన్నా కూడా ప్రిన్స్ కనుక కచ్చితంగా నచ్చుతాడు అందులో డౌట్‌ లేదు.

ఈ పిక్ ను షేర్ చేసిన నమ్రత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ ముగ్గురిలో ఎలాంటి తేడా లేవు.. రోజు రోజుకు మానసికంగా కూడా అందంగా వీళ్లు తయారు అవుతున్నారు అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా టెక్నాలజీ విషయంలో తాను చాలా వీక్ అని.. వారు నాకు చాలా విషయాలు నేర్పుతున్నారు అంది. నేను ఒక మంచి నేర్చుకునే స్టూడెంట్‌ ని అంటూ తనకు తాను చెప్పుకొచ్చారు.

గౌతమ్ మరియు సితారలు చాలా విషయాలను ముఖ్యంగా టెక్నాలజీకి సంబంధించిన విషయాలను అమ్మ నమ్రత తో షేర్ చేసుకుంటూ ఆమెకు నేర్పుతున్నారట. ఎంత క్యూట్‌ ఫ్యామిలీనో కదా... ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. వచ్చే ఏడాదిలో రాజమౌళి తో మహేష్ బాబు సినిమా పట్టాలెక్కబోతుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.