Begin typing your search above and press return to search.

నాన్న ఇచ్చిన దాంట్లో మీ అభిమానం గొప్పది

By:  Tupaki Desk   |   27 Nov 2022 11:30 AM GMT
నాన్న ఇచ్చిన దాంట్లో మీ అభిమానం గొప్పది
X
సూపర్ స్టార్ కృష్ణ మృతి ఆయన కుటుంబ సభ్యులకు మరియు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే కాకుండా యావత్ తెలుగు ప్రజానీకానికి కూడా దుఃఖాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే.

ఆయన మరణించిన వార్త తెలిసిన సమయంలో అభిమానులు కన్నీరు మున్నీరయ్యారు. అభిమానుల కోసం కృష్ణ చనిపోయిన సమయంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది.

నేడు జేఆర్సి ఎన్‌ కన్వెన్షన్ లో సూపర్ స్టార్ కృష్ణ యొక్క పెద్ద కర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు కుటుంబ సభ్యులు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. నా జీవితంలో నాన్న నాకు ఎన్నో ఇచ్చారు, వాటన్నింటిలోకి మీ అభిమానం చాలా గొప్పది.

మీలాంటి అభిమానులను ఇచ్చినందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాన్న గారు ఎప్పుడు కూడా నా గుండెల్లో ఉంటారు. మీ గుండెల్లో ఉంటారు, నాకు మా ఫ్యామిలీకి మీ అభిమానం ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అంటూ మహేష్ బాబు వ్యాఖ్యలు చేశారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.