Begin typing your search above and press return to search.
పుట్టిన రోజు మహేష్ మంచి పని
By: Tupaki Desk | 9 Aug 2018 5:56 PM GMTఆగస్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గురువారం అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇదే రోజు మహేష్ బాబు ఒక మంచి సందేశంతో అభిమానుల్ని పలకరించారు. తెలంగాణ ఎంపీ కవిత.. గురువారం ‘సిస్టర్స్ ఫర్ ఎ ఛేంజ్’ పేరుతో ఒక వినూత్న కార్యక్రమం మొదలుపెట్టారు. రాఖీ పండుగ రోజు అమ్మాయిలు తమ సోదరులకు రాఖీలు కట్టే సందర్భంగా వారికి ఓ హెల్మెట్ బహుమానంగా ఇచ్చి.. దాన్ని తప్పకుండా ధరించాలని సూచించడమే ఈ ‘సిస్టర్ ఫర్ ఎ ఛేంజ్’ కార్యక్రమం ఉద్దేశం.ఈ కార్యక్రమానికి మహేష్ తన సహకారం అందించాడు. దీనికి మద్దతుగా ఒక సందేశంతో కూడిన వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.
‘‘మన దేశంలో జరిగే యాక్సిడెంట్లలో రోజుకి 28 మంది హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్ల చనిపోతున్నారు. అంటే 28 కుటుంబాలు వాళ్లు ప్రేమించే మనుషులను కోల్పోతున్నారు. జస్ట్ ఒక చిన్న కేర్ లెస్ నెస్ వల్ల. ఇట్స్ టైం ఫర్ ఏ ఛేంజ్. ఈ రక్షా బంధన్ కి మీ అన్నయ్యకి.. తమ్ముడికి రాఖీతో పాటు ఓ హెల్మెట్ గిఫ్టుగా ఇవ్వండి. తప్పకుండా పెట్టుకోమని చెప్పండి. లైఫ్ సేఫ్ ఇజ్ ఏ ఫ్యామిలీ సేఫ్. సిస్టర్స్ ఫర్ ఛేంజ్’’ అని ఈ వీడియోలో మహేష్ పేర్కొన్నాడు. అనంతరం కవిత మహేష్ వీడియోను షేర్ చేస్తూ అతడికి థ్యాంక్స్ చెప్పారు. అతడికి జన్మదిన శుభకాంక్షలు కూడా చెప్పారు. ‘‘హ్యాపీ బర్త్ డే మహేష్ బాబు గారు. మంచి ఉద్దేశంతో ప్రారంభించిన సిస్టర్ స్‌ఫర్ ఛేంజ్ కి మద్దతు ఇచ్చినందుకు మనస్పూర్తిగా థ్యాంక్స్. ఈ వీడియోని కొంతమందైనా ఆదర్శంగా తీసుకొని హెల్మెట్లు బహుమతిగా ఇచ్చి ప్రాణాలు కాపాడుతారని అనుకుంటున్నా’’ అని కవిత అన్నారు.