Begin typing your search above and press return to search.
దునియాలో పాన్ ఇండియాని కేర్ చేయని ఒక్కడు!!
By: Tupaki Desk | 17 Aug 2021 7:30 AM GMTటాలీవుడ్ హీరోల పాన్ ఇండియా ప్రయత్నాలు హీట్ పెంచుతున్నాయి. బాహుబలి సినిమాతో డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఆ తర్వాత పాన్ ఇండియా కేటగిరీలో సాహో చిత్రాన్ని అదే స్థాయిలో రిలీజ్ చేసారు. ప్రస్తుతం నటిస్తున్న రాధేశ్యామ్.. సలార్ చిత్రాలు కూడా పాన్ ఇండియా కేటగిరీకి చెందినవే. ప్రాంతీయం అనేది ఇక లేదు.
ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా స్టార్లుగా అవతరించబోతున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న క్రేజీ పాన్ ఇండియా చిత్రం కావడంతో ఇద్దరు స్టార్లు పాన్ ఇండియా హీరోలుగా స్కైని టచ్ చేస్తారనడంలో సందేహం లేదు. అలాగే చరణ్ 15వ చిత్రం కూడా పాన్ ఇండియా కేటగిరీనే. దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ తో కలిసి పాన్ ఇండియా కేటగిరీలో దిల్ రాజు నిర్మిస్తుస్తున్నారు.
ఇక `పుష్ప` చిత్రంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారుతుతున్నారు. స్టైలిష్ మేకర్ సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో పాన్ ఇండియా సక్సెస్ పై భారీ అంచనాలే ఉన్నాయి. చిరంజీవి- నాగార్జున లాంటి స్టార్లు కూడా పాన్ ఇండియా కంటెంట్ కే ఓటేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి సైరా నరసింహారెడ్డి,- లూసీఫర్ లాంటి కంటెట్ ఉన్న చిత్రాల్ని ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వైల్డ్ డాగ్ చిత్రంతో నాగార్జునకి బాలీవుడ్ ఆడియెన్ నుంచి మంచి పేరొచ్చింది. గతంలో హిందీ సినిమాలు కొన్ని చేసినా కింగ్ మళ్లీ అన్ని భాషల్లోనూ తన చిత్రాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసకుంటున్నారు.
అయితే సూపర్ స్టార్ మహేష్ మార్గం మాత్రం వీళ్లందరీ కంటే భిన్నంగా ఉంది. అతడు పూర్తిగా తెలుగు చిత్రాలపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తెలుగు మార్కెట్ లోనే దద్దరిల్లే సినిమాలు తీసి ఆ సౌండింగ్ దేశం మొత్తం వినిపించేలా మహేష్ టార్గెట్ ఫిక్స్ చేసారని తెలుస్తోంది. వసూళ్ల పరంగా మహష్ సినిమాలు వరుసగా 150 కోట్ల మార్క్ ని సునాయాసంగా దాటేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహేష్ పాన్ ఇండియా కేటగిరీపై అంతగా దృష్టి పెట్టడం లేదట. మహేష్ అత్యంత సన్నిహిత వర్గాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించడం హాట్ టాపిక్ గా మారింది. పాన్ ఇండియాని ఖాతరు చేయని `ఒక్కడు`! అంటూ గుసగుస వైరల్ గా మారింది. మరోవైపు మహేష్ తన సొంత బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తూ .. ఏఎంబీ మాల్స్ విస్తరణపైనా దృష్టి సారించిన సంగతి విధితమే.
గోవాలో సర్కార్ వారి సందడి
సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `సర్కారు వారి పాట` కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి చిత్రయూనిట్ గోవా వెళ్లింది. మహేష్ బాబు కుటుంబం .. భార్య నమ్రత శిరోద్కర్ .. పిల్లలు సితార- గౌతమ్ ఈ ట్రిప్ లో ఉన్నారు. నమ్రత వారి స్నేహితులతో ఒక ప్రైవేట్ విమానంలో వారి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి. సెకండ్ వేవ్ కరోనావైరస్ తర్వాత సర్కార్ వారి బృందం ఇటీవల హైదరాబాద్ లో సినిమా షూటింగ్ ని మొదలెట్టారు. ఇప్పుడు గోవాలో దిగి అక్కడా బీచ్ లో చిత్రీకరణలో బిజీ అయ్యారు.
ఆగష్టు 9 న మహేష్ బాబు పుట్టినరోజు నాడు సినిమా నిర్మాతలు `సర్కారు వారి పాట` టీజర్ ను విడుదల చేయగా వైరల్ అయ్యింది. ఇందులో కీర్తి పక్కింటి అమ్మాయి పాత్రలో కనిపించగా.. మహేష్ ఇందులో కలెక్టర్ గా అప్పులు వసూలు చేసే వాడిగా డ్యూయల్ షేడ్ ఉన్న పాత్రలో కనిపిస్తారు. మహేష్ సరికొత్త హెయిర్ స్టైల్ తో మాసీ లుక్ తోనూ అలరించనున్నారు. అలాగే మహేష్ - కీర్తి లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ ఓ రేంజులోనే వర్కవుటైందని టీజర్ తెలిపింది. థమన్ ఈ చిత్రానికి ట్యూన్ లు కంపోజ్ చేస్తున్నారు. 13 జనవరి 2022 న ప్రేక్షకుల ముందుకు రానుంది.