Begin typing your search above and press return to search.
సౌత్ స్టార్స్ కు అందనంత దూరంలో మహేష్
By: Tupaki Desk | 7 March 2020 6:17 AMసూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియా లో కూడా దూసుకు పోతున్నాడు. ఆల్ ఇండియా స్టార్ డం ఉన్న మహేష్ బాబును ట్విట్టర్ లో ఏకంగా 9 మిలియన్ ల మంది ఫాలో అవుతున్నారు. కేవలం సినిమాతో నే కాకుండా బుల్లి తెరపై కూడా పదుల కొద్ది యాడ్స్ తో ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాడు. ఇక ఉత్తరాది ప్రేక్షకుల ముందుకు మహేష్ బాబు నటించిన పలు సినిమాలు డబ్ అయ్యి వెళ్లాయ్యి.
హిందీ బుల్లి తెర ప్రేక్షకులను మహేష్ బాబు డబ్బింగ్ సినిమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అందుకే అక్కడ కూడా మహేష్ బాబుకు ఫ్యాన్స్ ఉన్నారు. అక్కడ ఇక్కడ అన్ని చోట్ల కూడా తనకున్న ఫ్యాన్స్ కారణంగా సోషల్ మీడియా ట్విట్టర్ లో ఏకంగా 9 మిలియన్ ల మంది ఫాలోవర్స్ ను పొందాడు. ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ స్టార్స్ కూడా ఎవరు ఈ స్థాయిలో ఫాలోవర్స్ ను కలిగి లేరు. టాలీవుడ్ లో టాప్ స్టార్స్ అయిన పవన్ కళ్యాణ్ 3.4.. రాజమౌళి 4.7 ఇంకా బన్నీ 3.9 మిలియన్ ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు.
బాలీవుడ్ స్టార్స్ రేంజ్ లో ట్విట్టర్ లో ఫాలోవర్స్ ను కలిగి ఉన్న మహేష్ బాబు మొన్న సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా మంచి వసూళ్లను రాబట్టినట్లుగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇక మహేష్ బాబు తదుపరి చిత్రాల గురించి చర్చ జరుగుతోంది. గత కొన్ని రోజులుగా మెగా 152 చిత్రంలో మహేష్ బాబు నటించబోతున్నాడని.. 30 కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది.