Begin typing your search above and press return to search.

ఒక వైపు సూపర్‌ స్టార్‌ మరో వైపు చిన్న స్టార్‌... మహానటికే ఇది చెల్లు

By:  Tupaki Desk   |   13 Dec 2020 11:30 AM GMT
ఒక వైపు సూపర్‌ స్టార్‌ మరో వైపు చిన్న స్టార్‌... మహానటికే ఇది చెల్లు
X
సౌత్‌ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం కీర్తి సురేష్‌ హవా కొనసాగుతుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు వరుసగా తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ తో మరియు తెలుగు సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుతో మాత్రమే కాకుండా ఇంకా పలువురు యంగ్‌ స్టార్ హీరోలతో కూడా నటిస్తుంది. సాదారణంగా హీరోయిన్స్‌ స్టార్స్‌.. సూపర్‌ స్టార్‌ హీరోలతో సినిమాలు చేసే సమయంలో చిన్న హీరోలకు కాస్త దూరంగా ఉంటారు. పారితోషికం విషయంలో మరీ ఎక్కువ ఆశ చూపించినప్పుడు లేదంటే మరేదైనా కారణాలు ఉన్న సమయంలోనే చిన్న హీరోలతో నటించేందుకు సిద్దంగా ఉంటారు. కాని వారు వీరు అనే తేడా లేకుండా కీర్తి సురేష్‌ అందరు హీరోలతో నటించేందుకు సిద్దంగా ఉంటుంది.

తమిళంలో విజయ్‌ వంటి సూపర్ స్టార్‌ తో నటించిన కీర్తి సురేష్‌ టాలీవుడ్‌ లో చిన్న హీరోలతో కూడా నటించేందుకు సిద్దంగా ఉంది. ఇదే సమయంలో ఈమె లేడీ ఓంరియంటెడ్‌ సినిమాలు చేస్తూ ట్యాలెంటెడ్‌ హీరోయిన్‌ గా పేరు దక్కించుకుంది. ఇలాంటి సమయంలో ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు అందరిని ఆశ్చర్యంకు గురి చేస్తున్నాయి. నితిన్‌ కు జోడీగా రంగ్‌ దే సినిమాలో నటించిన ఈ అమ్మడు మరో వైపు మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌ తో ఒక సినిమాలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

మహేష్‌ బాబు మరియు సాయి ధరమ్‌ తేజ్‌ సినిమాలు దాదాపు ఒకే సమయంలో పట్టాలెక్కబోతున్నాయి. ఈగోకు వెళ్లకుండా స్టార్‌ ల అందరితో కలిసి నటించేందుకు సిద్దంగా ఉన్న కీర్తి సురేష్‌ తీరుపై అందరు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ తరహా సినిమాల ఎంపిక కేవలం మహానటి ఫేం కీర్తి సురేష్‌ కు మాత్రమే చెల్లింది అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.