Begin typing your search above and press return to search.
రజినీకాంత్.. ఎన్నాళ్లకెన్నాళ్లకో
By: Tupaki Desk | 24 July 2016 11:02 AM GMTసూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని చూస్తున్న క్షణాలు వచ్చేశాయి. రజినీకాంత్ ఇండియాకు వచ్చేశారు. ఆయన ఆదివారమే చెన్నైలో అడుగుపెట్టారు. ఎలాంటి హడావుడి లేకుండా తన కూతురు సౌందర్యతో కలిసి ఆయన అమెరికా నుంచి చెన్నై చేరుకున్నారు. టీషర్ట్ దాని మీద జాకెట్ వేసుకుని.. నెత్తిన టోపీ.. గాగుల్స్ పెట్టుకుని.. హెడ్ ఫోన్స్ పెట్టుకుని జనాలు గుర్తుపట్టకుండా ఉండేలా తయారైన రజినీ.. సింపుల్ గా ఎయిర్ పోర్టులో నడుచుకుంటూ వస్తూ కనిపించారు. అయినా మీడియా వాళ్లు ఆయన వెంటపడ్డారు. ‘కబాలి’ ఇక్కడ ప్రభంజనం సృష్టిస్తున్న టైంలో ఆయన అమెరికాలో గడిపారు.
అనారోగ్య కారణాలతో రెండు నెలల కిందట రజినీ అమెరికాకు వెళ్లారు. అక్కడే చికిత్స తీసుకుని విశ్రాంతి తీసుకున్నారు. కొన్ని ఆధ్యాత్మిక కేంద్రాల్ని సందర్శించారు. రజినీకి ఏమైందో అన్న ఆందోళన పెరిగిపోతున్న టైంలో తన అమెరికా పర్యటనకు సంబందించి కొన్ని ఫొటోలు విడుదల చేసి టెన్షన్ తగ్గించారు. ఆ తర్వాత ‘కబాలి’ ప్రివ్యూ షో కూడా అమెరికాలోనే చూశారు రజినీ. ‘కబాలి’ విడుదలకు ముందే ఈ నెల 20న రజినీ చెన్నై చేరుకుంటారని వార్తలొచ్చాయి కానీ.. ఆయన విడుదల తర్వాతే వచ్చారు. ఇంట్లో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని ఆగస్టులో ఆయన రోబో-2 కొత్త షెడ్యూల్ షూటింగుకి వెళ్తారు. మూడు నెలల పాటు నిర్విరామంగా షూటింగులో పాల్గొని ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి చేయబోతున్నారు రజినీ.