Begin typing your search above and press return to search.

స్పైడర్ పై సూపర్ స్టార్ కామెంట్స్

By:  Tupaki Desk   |   28 Sept 2017 7:09 PM IST
స్పైడర్ పై సూపర్ స్టార్ కామెంట్స్
X
బుధవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన స్పైడర్ సినిమా మిక్సిడ్ టాక్ తో వెళుతోంది. మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఒకే సారి తెలుగు - తమిళ్ లో తెరకెక్కిన విషయం తెలిసిందే. దీంతో సినిమా తమిళ్ లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేశారు నిర్మాతలు. విడుదలకు ముందు నుంచి భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా కోసం ఓ వైపు ప్రేక్షకులు మరోవైపు సినీ స్టార్స్ కూడా చాలా వెయిట్ చేశారు.

అయితే ఈ సినిమాను కొందరు సినీ ప్రముఖులు స్పెషల్ షో వేసుకొని చూశారట. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా తమిళ్ లో స్పైడర్ స్పెషల్ షోని చూశారు. దర్శకుడు మురుగదాస్ ఆ షోను సూపర్ స్టార్ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. అయితే సినిమాను చుసిన రజినీ తన అనుభూతిని చెప్పుకున్నాడు. ఆయన ఏమన్నారంటే.. సినిమా చాలా బావుంది. యాక్షన్ సన్నివేశాలతో పాటు మంచి సందేశం కూడా ఉంది. ముఖ్యంగా మహేష్ బాబు నటన చాలా బావుంది. మురుగదాస్ చక్కని కథాంశాన్ని చాలా గొప్పగా తెరకెక్కించాడని తెలిపారు. అంతే కాకుండా ఇంత మంచి సినిమాను తెలుగు - తమిళ్ ప్రేక్షకులకు అందించినందుకు చిత్ర యూనిట్ కి అభినందనలు తెలుపుతున్నట్లు రజినీ వ్యాఖ్యానించారు.

సూపర్ స్టార్ కామెంట్స్ విన్న తర్వాత చిత్ర యూనిట్ చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యారట. అయితే గతంలో రజిని - మురగదాస్ కాంబో లో ఒక సినిమా వస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఆ సినిమా అధికారికంగా వెలువడలేదు. చాల సార్లు మురుగదాస్ సూపర్ స్టార్ తో సినిమా చెయ్యాలని అనుకున్నాడు కానీ ఎందుకో కుదరలేదట. మరి స్పైడర్ చూసిన రజినీ మురగదాస్ తో సినిమా తీస్తాడో లేదో చూడాలి.