Begin typing your search above and press return to search.

స్కూల్‌ పుస్తకంలో సూపర్‌ స్టార్‌

By:  Tupaki Desk   |   10 Jun 2019 5:20 AM GMT
స్కూల్‌ పుస్తకంలో సూపర్‌ స్టార్‌
X
తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక వ్యక్తి జీవిత గమనంలో ఏ స్థాయికి చెందిన వాడు అయినా కష్టపడితే ఉన్నత స్థాయికి చేరవచ్చు అనేందుకు ప్రత్యక్ష ఉదాహరణగా రజినీకాంత్‌ నిలుస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక కార్పెంటర్‌ ఆ తర్వాత బస్సు కండక్టర్‌ అయ్యి అక్కడ నుండి సినిమా రంగ ప్రవేశం చేసి ఏకంగా ఇండియాస్‌ సూపర్‌ స్టార్‌ అవ్వడం జరిగింది. ఆ కార్పెంటర్‌ మరెవ్వరో కాదు రజినీకాంత్‌. అందుకే ఆయన గురించి ఈతరం వారు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రజినీకాంత్‌ జీవితం గురించి అందుకే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం 5వ తరగతి పాఠ్యపుస్తకంలో పెట్టడం జరిగింది. 'ర్యాగ్స్‌ టు రిచెస్‌' అనే పాఠ్యాంశంలో పలువురు ప్రముఖుల జీవితాలను పెట్టడం జరిగింది. అందులో రజినీకాంత్‌ జీవితంను కూడా చేరార్చు. ఆ పాఠం ఉద్దేశ్యం ప్రకారం జీరో స్థాయి నుండి కష్టపడి పైకి వచ్చిన వారి జీవితాలను పిల్లలకు తెలియజేయడం.. కష్టపడి పని చేస్తే ఏదైనా సాధ్యమే అని పిల్లల హృదయాల్లో నాటడం కోసం ఆ పాఠంను పెట్టడం జరిగింది.

ఛార్లీ ఛాప్లిన్‌.. స్టీవ్‌ జాబ్స్‌.. జేకే రౌలింగ్‌ తో పాటు ఇంకా ప్రముఖుల బయోగ్రఫీలు క్లుప్తంగా ఉన్నాయి. వారితో పాటు రజినీకాంత్‌ జీవితంను కూడా అందులో పెట్టారు. రజినీకాంత్‌ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి కనుక ఆయన గురించి కూడా పెట్టినట్లుగా ప్రభుత్వ వర్గాల వారు చెబుతున్నారు.

ప్రస్తుతం రజినీకాంత్‌ 'దర్బార్‌' చిత్రంలో నటిస్తున్నాడు. మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రంలో హీరోయిన్‌ గా నయన తార నటిస్తోంది. భారీ అంచనాలున్న ఆ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.