Begin typing your search above and press return to search.
మహేష్ బాబు సినిమాలో సూపర్ స్టార్
By: Tupaki Desk | 14 Aug 2022 10:36 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో చాలా రోజుల క్రితం ప్రకటన వచ్చిన సినిమా ఎట్టకేలకు ప్రారంభం అయ్యింది. మహేష్ బాబు.. త్రివిక్రమ్ కాంబో మూవీ అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని అభిమానులు నమ్మకంతో ఉన్నారు.
సినిమా స్థాయిని మరింతగా పెంచేందుకు గాను యూనిట్ సభ్యులు ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ను నటింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. నటుడిగా మరియు దర్శకుడిగా పృథ్వీరాజ్ ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెల్సిందే. అందుకే ఈ సినిమా లో ఆయన నటించడం ఎంత వరకు సాధ్యం అనేది చర్చనీయాంశంగా మారింది.
ఇటీవలే తెలుగు లో వరుసగా సినిమాలను చేసేందుకు తాను సిద్ధం అన్నట్లుగా పృథ్వీరాజ్ చెప్పుకొచ్చాడు. సలార్ సినిమాలో కూడా ఈయన కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో కూడా నటించేందుకు ఓకే చెప్పాడట. కానీ డేట్ల విషయం లోనే కాస్త గందరగోళం నెలకొంది అంటూ వార్తలు వస్తున్నాయి.
మహేష్ బాబు.. త్రివిక్రమ్ సినిమాలోని కీలక పాత్రకు పృథ్వీరాజ్ ను ఎంపిక చేయడం మంచి నిర్ణయమే అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కాని డేట్ల విషయంలో పృథ్వీరాజ్ ఎంత వరకు మహేష్ బాబు సినిమా కోసం అడ్జస్ట్ చేస్తాడో చూడాలి. ప్రస్తుతం పృథ్వీరాజ్ అరడజను సినిమాల్లో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.
పృథ్వీరాజ్ కేవలం హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. విలన్ గా అనేక పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. మరో వైపు దర్శకుడిగా కూడా ఈయన సినిమా ను చేస్తున్నాడు. మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబోలో సినిమా కోసం పృథ్వీరాజ్ ఎంత వరకు డేట్లను కేటాయించగలడు.. ఎప్పటి వరకు సినిమా పూర్తి అయ్యేను అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.