Begin typing your search above and press return to search.
హైదరాబాద్ కు సముద్రం తీసుకు వచ్చిన సూపర్ స్టార్
By: Tupaki Desk | 10 May 2022 7:30 AM GMTసినిమా అనేది రంగుల ప్రపంచం.. లేనిది కూడా ఉన్నట్లుగా చూపించడ సినిమా యొక్క ప్రాముఖ్యత అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమద్య గ్రాఫిక్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంకా విజువల్ వండర్స్ ను క్రియేట్ చేస్తున్నారు. ఒక స్టూడియో లో గ్రీన్ మ్యాట్ పై షూటింగ్ జరిపి ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్నట్లుగా గ్రాఫిక్స్ మిక్సింగ్ చేయగల టెక్నాలజీ వచ్చింది.
ఇక సెట్టింగ్స్ పేరుతో అద్బుత కట్టదాలను మళ్లీ నిర్మించి వాటి వద్ద షూటింగ్ లను చేస్తున్నారు. మహేష్ బాబు ఒక్కడు సినిమా కోసం ఛార్మినార్ సెట్ వేసి అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. అప్పట్లో కోటి రూపాయలతో సెట్టింగ్ అంటే మామూలు విషయం కాదు. ఛార్మినార్ సెట్టింగ్ ను కోటి రూపాయలు పెట్టి వేయించారు. మహేష్ బాబు ఆ తర్వాత అర్జున్ సినిమా లో నటించగా ఆ సినిమాలో కూడా భారీ సెట్టింగ్ ను వేయించారు.
కొన్ని రియల్ లొకేషన్స్ లో జనాల వల్ల షూటింగ్ కు ఇబ్బందిగా ఉంటుంది. అందుకే వాటినే స్టూడియోల్లో లేదా ఔట్ డోర్ లో సెట్టింగ్స్ గా వేస్తూ ఉంటారు. వైజాగ్ ఆర్కే బీచ్ చాలా ఫేమస్. అక్కడ వందల కొద్ది సినిమాల షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి. అయితే పెద్ద హీరోల సినిమాల షూటింగ్ అనగానే ఎక్కడెక్కడ నుండో జనాలు వస్తారు. ఇప్పుడు రామ్ చరణ్.. శంకర్ ల సినిమాకు అదే సమస్య ఎదురవుతోంది.
దిల్ రాజు నిర్మిస్తున్న ఆర్ సీ 15 సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను ఆర్కే బీచ్ లో ప్లాన్ చేశారు. కాని అక్కడ జనాలను అదుపులో ఉంచడానికి ఏకంగా 200 మంది ప్రైవేట్ సెక్యూరిటీ కావాల్సి వచ్చిందట. మహేష్ బాబు సినిమాకు ఆ ఇబ్బందిని ముందస్తుగానే ఊహించి ఆర్కే బీచ్ ను హైదరాబాద్ లో నిర్మించారట.
రామోజీ ఫిల్మ్ సిటీలో ఆర్కే బీచ్ సెట్టింగ్ ను నిర్మించారట. బీచ్ లో సన్నివేశాలను గురించి దర్శకుడు మహేష్ బాబు తో చెప్పిన సమయంలో అన్ని రోజులు అక్కడ షూటింగ్ అంటే కష్టం అన్నాడట. దాంతో రామోజీ ఫిల్మ్ సిటీలో వీఎఫ్ ఎక్స్ టీమ్ మరియు ఆర్ట్ డిపార్ట్ మెంట్ కలిసి గ్రీన్ మ్యాట్ తో ఒక బీచ్ సెట్ ను నిర్మించాట.
బీచ్ లో ఉండే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని అంటున్నారు. అందుకే కాస్త ఎక్కువ ఖర్చు అయినా ఫిల్మ్ సిటీలో బీచ్ సెట్టింగ్ ను వేయడం జరిగిందని చిత్ర యూనట్ సభ్యులు అంటున్నారు. మహేష్ బాబు.. కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా ఈనెల 12వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.