Begin typing your search above and press return to search.
లైకాని లేపడం కోసమే సూపర్ స్టార్ కమిట్ మెంట్లా?
By: Tupaki Desk | 8 Oct 2022 6:38 AM GMTసూపర్ స్టార్ రజనీకాంత్ 'అన్నాథై' తో మళ్లీ ఫాంలోకి వచ్చేసిన సంగతి తెలిసిందే. 'పెద్దన్న'గా తెలుగులో డబ్ అయిన సినిమా ఇక్కడ ఆశించిన ఫలితాలు సాధించలేదు గానీ..మాతృకలో పెద్ద విజయమే అందుకుంది. 'దర్బార్'..'పెట్టా' వరుస ప్లాప్ లు అందుకున్న సూపర్ స్టార్ ని 'అన్నాతై' మళ్లీ పట్టాలెక్కించింది. ప్రస్తుతం రజనీ కాథనాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'జైలర్' తెరకెక్కుతోంది.
భారీ యాక్షన్ థ్రిల్లర్ పై అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే కొద్ది భాగం షూటింగ్ పూర్తయింది. బ్యాలెన్స్ సహా అన్ని పనులు పూర్తిచేసి వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో 'జైలర్' సెట్స్ లో ఉండగానే రజనీ మరో రెండు కొత్త ప్రాజెక్ట్ లకు కమిట్ అయ్యారు. తదుపరి లైకా ప్రొడక్షన్స్ రెండు భారీ చిత్రాలు చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు.
వీటిలో ఓ చిత్రానికి 'డాన్' డైరెక్టర్ శిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. మరో సినిమాకి దర్శకుడ్ని ఫైనల్ చేయాల్సి ఉంది. అయితే ఒకేసారి లైకాలో రజనీ రెండు ప్రాజెక్ట్ లు కమిట్ అవ్వడం ఆసక్తికరంగా మారింది. గత చిత్రాల నష్టాల్ని భర్తి చేయడం కోసమే పెద్దాయన అభయ హస్తం ఇచ్చారా? అన్న సందేహం తెరపైకి వస్తుంది.
గతంలో ఇదే బ్యానర్ లో రజనీ వరుసగా రెండు భారీ సినిమాలు చేసారు. ఒకటి '2.0' .. రెండు 'దర్భార్'. 500 కోట్ల బడ్జెట్ తో శంకర్ దర్శకత్వంలో నిర్మించిన '2.0' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టలేదు. అధికారిక లెక్కల ప్రకారం ఖర్చులు తీసేయగా 200 కోట్ల లాభంలో ఉన్నట్లు ప్రచారం సాగింది గానీ అందులో వాస్తవం కనిపంచలేదు.
ఆ సినిమాకి నష్టాలే వచ్చాయని అప్పట్లో కోలీవుడ్ మీడియా కథనాలు వెడెక్కించాయి. అటుపై మురుగదాస్ దర్శకత్వం వహించిన ' దర్బార్' కి 200 కోట్లు ఖర్చు చేసారు. ఈ సినిమా లైకాకి భారీ నష్టాల్నే తెచ్చి పెట్టింది. ఆ రకంగా లైకాలో సూపర్ స్టార్ నటించిన రెండు సినిమాలు సదరు సంస్థకి ఏమంత సంతృప్తినివ్వలేదు.
ఈ నేపథ్యంలో లైకా నష్టాల్ని భర్తీ చేసేందు కు రజనీ మరోసారి రంగంలోకి దిగినట్లు ప్రచారం సాగుతోంది. బ్యాక్ టూ బ్య్ రెండు సినిమాల కమిట్ మెంట్ వెనుక అసలు కథే ? ఇదే అయి ఉంటుందని మీడియాలో కథనాలొస్తున్నాయి. ఆ సంగతి పక్కనబెడితే వరుసగా రెండు సినిమాలు లైకాలో కమిట్ అవ్వడం..వాటి అప్ డేట్ తో అభిమానుల్లో జోష్ మొదలైంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.