Begin typing your search above and press return to search.

సూపర్‌ స్టార్‌ క్రేజీ డైరెక్టర్‌ కాంబో 'బాస్‌'

By:  Tupaki Desk   |   14 Jun 2022 1:30 PM GMT
సూపర్‌ స్టార్‌ క్రేజీ డైరెక్టర్‌ కాంబో బాస్‌
X
తమిళ క్రేజీ డైరెక్టర్స్ లో నెల్సన్‌ దిలీప్ ఒకరు. ఈయన బ్యాక్‌ టు బ్యాక్ భారీ బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తూ భారీ విజయాలను దక్కించుకుంటున్నాడు. తాజాగా ఈయన సూపర్ స్టార్ రజినీకాంత్‌ హీరోగా ఒక సినిమాను మొదలు పెట్టిన విషయం తెల్సిందే. సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

తాజాగా సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ మరియు నెల్సన్‌ దిలీప్ ల యొక్క సినిమా టైటిల్‌ గురించి మీడియాలో వార్తలు వస్తున్నాయి. తమిళ మీడియా వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న వార్తల అనుసారం వీరి క్రేజీ కాంబో మూవీకి 'బాస్‌' అనే టైటిల్‌ ను అనుకుంటున్నారట.

నెల్సన్‌ దిలీప్ తన సినిమాల యొక్క టైటిల్స్ చాలా విభిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తాడు. అందుకే రజినీకాంత్‌ ఇమేజ్ కు తగ్గట్లుగా బాస్ టైటిల్‌ ను అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

రజినీకాంత్ కు కమర్షియల్‌ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ దక్కక చాలా సంవత్సరాలు అయ్యింది. సుదీర్ఘ కాలం తర్వాత రజినీ కాంత్ ఒక బ్లాక్ బస్టర్ కమర్షియల్‌ సక్సెస్ ను దక్కించుకోబోతున్నాడు అంటూ అభిమానులు చాలా నమ్మకంతో వెయిట్‌ చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయ్యింది. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.

ఈమద్య కాలంలో తమిళం లో రూపొందుతున్న సినిమా లు పాన్ ఇండియా రేంజ్ లో మంచి వసూళ్లను నమోదు చేస్తున్నాయి. అందుకే రజినీకాంత్‌ కు ఉన్న పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు నెల్సన్ దిలీప్ స్క్రిప్ట్‌ వర్క్ చేశాడని.. తప్పకుండా ఇది ఒక పక్కా కమర్షియల్‌ సక్సెస్‌ అవుతుందనే నమ్మకంను తమిళ మీడియా వర్గాల వారు అంటున్నారు.

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ మరియు నెల్సన్ దిలీప్ సినిమాకు సంబంధించిన ఒక్కో అప్‌డేట్‌ అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. అందుకే ఈ సినిమా తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేస్తారేమో చూడాలి. సినిమాకు సంబంధించిన విషయాలు ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.