Begin typing your search above and press return to search.
కూతురుతో సూపర్ స్టార్ క్రేజీ పిక్.. వైరల్!
By: Tupaki Desk | 12 Jun 2021 9:30 AM GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. సినిమానా లేక ఫ్యామిలీనా అంటే ఖచ్చితంగా ఫ్యామిలీనే ముందు అంటారు. ఎందుకంటే మహేష్ ఎప్పుడు షూటింగులతో బిజీగా ఉన్నప్పటికీ ఖాళీ సమయం దొరికిందంటే మాత్రం తన పిల్లలతో సరదాగా గడపడానికే ఫుల్ టైం కేటాయించేస్తాడు. పిల్లలతోనే సరదాగా అలా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్స్ లేక ఇంటిపట్టునే ఉంటున్న మహేష్.. ఫ్యామిలీతో డైలీ జోలిగా గడిపేస్తున్నాడు. అయితే పిల్లలలో కూడా మహేష్ ఎక్కువగా కూతురు సితారతోనే ఎక్కువగా అల్లరి చేస్తాడనే విషయం తెలిసిందే.
అయితే సితారతో మహేష్ రోజురోజుకి అల్లరి బాగానే చేస్తున్నాడట. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆయన భార్య నమ్రత శిరోద్కర్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. మహేష్ కూడా అప్పుడప్పుడు తన పిల్లలతో సరదాగా గడిపిన వీడియోలను, ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తుంటాడు. తాజాగా కూతురు సితారతో ఆడుకుంటున్న ఫోటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. తాజాగా మహేష్ - సితారకు సంబంధించి ఓ క్యూట్ ఫోటోని సోషల్ మీడియాలో పోస్టు చేసింది నమ్రత. ముఖ్యంగా కూతురు సితార అయితే మహేష్ ను ఒక్క క్షణం కూడా వదలడం లేదని చెబుతోంది.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టైటిల్.. ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ - 14 రీల్స్ ప్లస్ - జియంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమాతో పాటు మహేష్ ఇటీవలే డైరెక్టర్ త్రివిక్రమ్ తో ఓ సినిమా ఓకే చేసాడు. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ దశలో ఉంది. సర్కారు పాట షూటింగ్ అయిపోగానే మహేష్ త్రివిక్రమ్ మూవీ కంప్లీట్ చేయనున్నాడు. మొత్తానికి మహేష్ ప్రతి సినిమాకు భారీ అంచనాలు సెట్ చేస్తున్నాడు.