Begin typing your search above and press return to search.
సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న సూపర్ స్టార్..!
By: Tupaki Desk | 27 April 2021 6:30 PM GMTమలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఏది చేసినా ప్రత్యేకంగా నిలుస్తుంది. 60 ఏళ్లకు పైబడిన వయసులో కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఇక రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకున్నారు కంప్లీట్ యాక్టర్. అందరికీ సేంద్రీయ వ్యవసాయం గురించి చెప్పడమే కాదు, చేసి చూపించాడు. లాక్ డౌన్ సమయంలో ఎర్నాకుళంలోని తన ఇంటి వద్ద సేంద్రియ పంటలు పండించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మోహన్ లాల్ తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు.
సేంద్రీయ పద్ధతిలో వంకాయలు, సొరకాయలు, కాకరకాయలు, టమోటాలు, మొక్కజొన్న వంటి పంటలు మోహన్ లాల్ పండిస్తున్నట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. అందరూ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేలా ప్రోత్సహించడానికి తన టీమ్ తో కలసి సినిమా టీజర్ మాదిరిగా ఈ వీడియోని కట్ చేసి రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా అందరూ ఇంటి టెర్రస్ ల మీద, బాల్కనీల్లోనూ నచ్చిన పంటలను పండించుకోవచ్చని సూచించారు. అంతేకాదు సేంద్రీయ వ్యవసాయం గురించి, అందులో ఉన్న లాభాల గురించి తన స్నేహితులకు వివరిస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. పాత్ర ఏదైనా దానికి పూర్తి న్యాయం చేసి కంప్లీట్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు మోహన్ లాల్. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన మోహన్ లాల్.. 'గాండీవం' చిత్రంలోని ఒక పాటలో మెరిసారు. ఆ తర్వాత 'జనతా గ్యారేజ్' 'మనమంతా' సినిమాలలో తన సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. ఆయన నటించిన 'దృశ్యం 2' సినిమా ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ క్రమంలో 'ఆరాట్టు' అనే మరో సినిమాని రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. అలానే ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న 'మరక్కార్ - అరబికదలింటే సింహం' సినిమాని ఆగస్ట్ 12న రిలీజ్ చూస్తున్నారు. ఇక 'బరోజ్' అనే 3డీ సినిమాతో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకున్నారు కంప్లీట్ యాకర్ట్.