Begin typing your search above and press return to search.
సినిమాలకంటే 'యాడ్స్'తో సూపర్ స్టార్ ఆదాయం..??
By: Tupaki Desk | 30 Jan 2021 3:30 AM GMTటాలీవుడ్ స్టార్ హీరోలలో సినిమాల గురించి పక్కనపెడితే ఎక్కువగా యాడ్స్ లో కనిపించే హీరో మహేష్ బాబు. ఇంటర్నేషనల్ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా అత్యధికంగా ఆదాయం పొందుతున్నాడని తెలిసిందే. దక్షిణాది భారత సినీపరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న పాపులారిటీ ఏ హీరోకు లేదు. అందుకే పలు భారీ సంస్థలు మహేష్ ను బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకుంటున్నాయి.
మొదటి నుండి థమ్స్అప్ యాడ్ కోసం ఏకంగా స్టంట్స్ కూడా చేస్తున్నాడు. అయితే మరి అంతలా స్టంట్స్ చేస్తూ కష్టపడే మహేష్ ఈ యాడ్లకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడు? అనేది టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో కూడా మహేష్ చేసినన్ని యాడ్స్ చేయలేరు. అలాగే మహేష్ వెంటపడినట్లుగా వేరే ఏ హీరో వెంట యాడ్ ఏజెన్సీలు వెనకపడటం లేదట. టాప్ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న మహేష్ కు ఒక్కో ఏజెన్సీ కోట్లలో చెల్లిస్తారని టాక్.
ఓ వైపు చిన్న హీరోలే భారీ పారితోషికం డిమాండ్ చేస్తుంటే మరి సూపర్ స్టార్ మహేష్ కు ఏ రేంజిలో పే చేయాల్సి ఉంటుంది. మహేష్ క్రేజ్ కార్పొరేట్ కంపెనీలకు ఆదాయం తీసుకొస్తుంటే వారు అడిగినంత ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. ప్రస్తుతం మహేష్ థమ్స్అప్ యాడ్ తో పాటు.. సంతూర్, బైజూస్, డెన్వర్ లాంటి బ్రాండ్ లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ యాడ్స్ అన్నింటికీ మహేష్ భారీ పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు ఈ మధ్య ఫ్లిప్ కార్ట్ బ్రాండింగ్ కూడా చేస్తున్నాడు సూపర్ స్టార్.
అయితే మొత్తంగా మహేష్ కు వార్షికంగా యాడ్స్ ఆదాయం డెబ్భై ఐదు కోట్ల పైనే ఉంటుందని ట్రేడ్ వర్గాలలో అంచనా వేస్తున్నారు. అయితే మహేష్ బాటలో స్టైలిష్ స్టార్ ఫ్యామిలీ కూడా వెళ్లే ఆలోచన చేస్తుందట. అందుకే ప్రస్తుతం ఓ ప్రముఖ ముంబై యాడ్ ఏజెన్సీ కంపెనీతో చర్చలు జరుపుతున్నట్లు వినికిడి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మహేష్ పరశురామ్ డైరెక్షన్ లో 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నాడు. మహేష్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.