Begin typing your search above and press return to search.
కొడుక్కి సూపర్ స్టార్ ఎమోషనల్ బర్త్ డే విషెష్
By: Tupaki Desk | 31 Aug 2022 6:30 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా... సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒక నెం.1 స్టార్ అయినా కూడా కుటుంబ సభ్యులతో మాత్రం ఒక సాదారణ భర్తగా.. ఒక సాధారణ తండ్రిగా వారితో కలిసి పోయి పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కూతురు మరియు కొడుకు తో మహేష్ బాబు సాధ్యం అయినంత ఎక్కువ సమయం కేటాయించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
తన ఇద్దరు పిల్లలు అంటే మహేష్ బాబుకు ఎంత ఇష్టమో.. ప్రేమో అందరికి తెల్సిందే. ఇద్దరి యొక్క ప్రత్యేక రోజులను ఆయన ఎంతో వైభవంగా సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు తన యొక్క అన్ని పనులను ఆ రోజున.. ఆ సందర్భంలో పక్కకు పెట్టేస్తాడు. ప్రతి రోజు కూడా వారితో ఎంతో కొంత సమయం అయినా గడపాలని మహేష్ బాబు కోరుకుంటాడు.
పిల్లల గురించి మహేష్ బాబు చేసే ప్రతి సోషల్ మీడియా పోస్ట్ కూడా ఆయనకు పిల్లల మీద ఎంత ప్రేమ ఉందో చెప్పకనే చెబుతుంది. నేడు మహేష్ తనయుడు గౌతమ్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సందర్భంగా మహేష్ బాబు చేసిన సోషల్ మీడియా పోస్ట్ అందరిని ఆకర్షిస్తోంది. మహేష్ బాబు తన యొక్క కొడుకు ప్రేమను.. తండ్రి బాధ్యతను ఆ ట్వీట్ లో ఎమోషనల్ గా తెలియజేశాడు.
మహేష్ బాబు... 16 ఏళ్లు అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నీవు నన్ను ప్రతి రోజు గర్వించేలా చేస్తున్నావు. నీవు యొక్క భవిష్యత్తులో సెటిల్ అయ్యే రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను.
ఈ జర్నీ లో నా యొక్క ప్రేమ మరియు ఆశీర్వాదాలు నీతో ఉంటాయి. ఒక్కటి గుర్తు పెట్టుకో... నీకు ఎలాంటి అవసరం వచ్చినా కూడా నేను నీ వెంట ఉంటాను. లవ్ యు మై సన్ అంటూ కాస్త ఎమోషనల్ గా మహేష్ బాబు పోస్ట్ చేశాడు.
ఒక వైపు మహేష్ బాబు వయసు తగ్గిన వాడిగా కనిపిస్తూ ఉంటే మరో వైపు గౌతమ్ పెరిగి పెద్ద వాడు అవుతున్నాడు. అతి త్వరలోనే గౌతమ్ హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అంటూ మహేష్ బాబు అభిమానులు అంటున్నారు.
ఇప్పటికే ఒక సినిమా లో నటించిన గౌతమ్ చదువు పూర్తి చేసుకుని అయిదు ఆరు సంవత్సరాల్లో లేదా కాస్త అటు ఇటుగా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టడం కన్ఫర్మ్ గా అభిమానులు నమ్మకంతో ఉన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.