Begin typing your search above and press return to search.

సూప‌ర్ స్టార్ కి మొద‌టి గాళ్ ఫ్రెండ్?

By:  Tupaki Desk   |   15 Jan 2023 2:30 AM GMT
సూప‌ర్ స్టార్ కి మొద‌టి గాళ్ ఫ్రెండ్?
X
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఇటీవల ట్విట్టర్ లో #AskSRK సెషన్ లో పాల్గొన్నారు. ఖాన్ త‌దుప‌రి చిత్రం పఠాన్ గురించి.. ట్రైలర్ పై అతని కుటుంబం ప్రతిస్పందన స‌హా చాలా సంగ‌తుల్ని అభిమానులు ప్ర‌శ్నించారు.

SRK అన్ని ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు. షారూఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ పైనా ఒక ప్ర‌శ్న ఎదురైంది. ఒక ట్విట్టర్ వినియోగదారు షారుఖ్ ను ప్ర‌శ్నిస్తూ..."మీ మొదటి స్నేహితురాలు ఎవరు?" అని SRK ని కొంటెగా ప్ర‌శ్నించారు. "నా భార్య గౌరీ" అని ఖాన్ త‌డుముకోకుండా వెంట‌నే బదులిచ్చారు.

షారుఖ్ ఖాన్ 1991లో గౌరీ ఖాన్ ను వివాహం చేసుకున్నారు. ఈ స్టార్ క‌పుల్ కి ఆర్యన్ (25) (వారి పెద్ద బిడ్డ) వార‌సుడు. అత‌డు యూనివర్శిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియాలో విద్యాభ్యాసం సాగించి పట్టభద్రుడయ్యాడు. ఈ జంట‌ కుమార్తె సుహానా త్వరలో జోయా అక్తర్ తెర‌కెక్కించిన 'ది ఆర్చీస్‌'తో న‌టిగా ప‌రిచ‌యం కానుంది. ముంబైలోని పాఠశాలలో చదువుతున్న 9 ఏళ్ల అబ్రామ్ కు SRK - గౌరీ కూడా తల్లిదండ్రులు. అబ్రామ్ స‌రోగ‌సి ద్వారా జ‌న్మించాడు.

గత సంవత్సరం కరణ్ జోహార్ చాట్ షో 'కాఫీ విత్ కరణ్ 7'లో గౌరీ ఖాన్ ని ఎస్‌.ఆర్‌.కె తో ప్రేమకథ కోసం ఒక మూవీ టైటిల్ ని సూచించ‌మ‌ని కోర‌గా..'దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే' (డీడీఎల్ జే)అంటూ జ‌వాబిచ్చారు. నాకు ఆ సినిమా నచ్చింది అని కూడా గౌరీ చెప్పారు. KJo అప్పుడు "మీది చాలా అల్లకల్లోలమైన ప్రేమకథ కదా?" అని ప్ర‌శ్నించ‌గా.. గౌరి 'అవును' అని స‌మాధాన‌మిచ్చారు.

గౌరీ ఖాన్ ఇంటీరియర్ డెకరేటర్. ఆమె ముంబైలో ఖరీదైన 'గౌరీ ఖాన్ డిజైన్ సెంట‌ర్'లను ఆప‌రేట్ చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా అనేక సబర్బన్ ముంబై రెస్టారెంట్లు ప్రముఖుల గృహాలకు మేకోవ‌ర్ ఇచ్చి వ్యాపార వృద్ధికి స‌హ‌క‌రించారు. అలియా భట్- వరుణ్ ధావన్ - కరణ్ జోహార్ వంటి అనేక మంది బాలీవుడ్ ఎ-లిస్టర్ ల ఇళ్లను అలంకరించిన లేదా డిజైన్ చేసిన ఘ‌న‌త‌ను పొందారు. ఆర్త్ -సాంచోస్ వంటి రెస్టారెంట్లను గౌరీ డిజైన్ చేసారు. ఆమె అలియా భట్ వ్యానిటీ వ్యాన్ ను కూడా డిజైన్ చేసారు. అదే కాకుండా గౌరీ ఖాన్ సినీ నిర్మాతగాను కొన‌సాగుతున్నారు. 2020 సంవత్సరంలో రచయిత్రిగా అరంగేట్రం చేసారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.