Begin typing your search above and press return to search.
బైక్ పై వెళ్లి భారత బోర్డర్ వద్ద సూపర్ స్టార్
By: Tupaki Desk | 22 Oct 2021 4:43 AM GMTతమిళ సూపర్ స్టార్ అజిత్ కు బైక్ రైడింగ్ అంటే ఎంత ఇష్టమో ప్రతి ఒక్కరికి తెల్సిందే. ఆయన ఒక గొప్ప రేసర్ అనే విషయం అందరికి తెల్సిందే. బైక్ పై కొన్ని వందలు.. వేల కిలో మీటర్ల ప్రయాణంను ఆయన చేస్తూ ఉంటాడు. ఆ ప్రయాణంలో ఎంతో మందిని కలుస్తూ సోషల్ మీడియా ద్వారా తన ప్రయాణంకు సంబంధించిన గుర్తులను మరియు జ్ఞాపకాలను షేర్ చేస్తూ ఉంటాడు. తాజాగా అజిత్ వాఘా సరిహద్దు వద్ద ఇండియా పాకిస్తాన్ దేశాల మద్య ఉండే గేటు వద్ద నిల్చుని మూడు రంగుల జెండా పట్టుకుని ఫొటోలకు ఫోజు ఇచ్చాడు. వాఘా సరిహద్దు అనేది ఒక చారిత్రాత్మక ప్రదేశం. అలాంటి ప్రదేశంకు బైక్ రైడింగ్ ద్వారా వెళ్లడం అనేది చాలా పెద్ద విషయంగా అభిమానులు చెప్పుకుంటున్నారు.
అజిత్ మూడు వారాల క్రితం చెన్నై నుండి బయలుజేరాడు. అప్పటి నుండి దేశంలోని ముఖ్య పట్టణాలు మరియు ప్రముఖ ప్రదేశాలను కూడా కవర్ చేస్తూ తన రైడ్ ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే తాజ్ మహల్ వద్దకు వెళ్లాడు. అక్కడ నుండి ఉత్తర భారతంలో చాలా ప్రదేశాలను కవర్ చేశాడు. అద్బుతమైన ప్రదేశాలను బైక్ రైడ్ తో చూడటం చాలా సంతోషంగా ఉందంటూ ఇటీవల అజిత్ చెప్పుకొచ్చాడు. ఇప్పడు అజిత్ చారిత్రాత్మక వాఘా సరిహద్దు వద్దకు వెళ్లాడు. అక్కడ నుండి అజిత్ తిరుగు ప్రయాణం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. వారం రోజుల్లో చెన్నైకు అజిత్ వస్తాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ఇక అజిత్ నటించిన వాలిమై సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. దీపావళికి విడుదల చేయాలని భావించినా కూడా వాలిమై ను ఇప్పడు వచ్చే నెల సంక్రాంతి సందర్బంగా జనవరిలో విడుదల చేయాలని భావిస్తున్నారు. భారీ అంచనాలున్న వాలిమై సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించాడు.. బోనీ కపూర్ నిర్మించాడు. హుమ కురేషి హీరోయిన్ గా నటించగా మన తెలుగు యంగ్ ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ విలన్ గా నటించాడు. వీరిద్దరి కాంబో లుక్ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచేసింది. వాలిమై సినిమా చిత్రీకరణ సమయంలో కూడా చెన్నై నుండి హైదరాబాద్ కు అజిత్ బైక్ రైడ్ చేసిన విషయం అందరికి తెల్సిందే.