Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ ఒక్కడే నాకు పోటీ-పవర్ స్టార్

By:  Tupaki Desk   |   28 May 2016 8:27 AM GMT
సూపర్ స్టార్ ఒక్కడే నాకు పోటీ-పవర్ స్టార్
X
పవన్ కళ్యాణ్ ఇంత మాట ఎప్పుడనేశాడు అంటారా..? ఐతే పవర్ స్టార్ అనగానే మన పవన్ ఒక్కడే అనుకోకండి. తమిళంలో కూడా ఒక పవర్ స్టార్ ఉన్నాడు. మనోళ్లకు పెద్దగా పరిచయం లేదు కానీ.. తమిళనాడుకు వెళ్లి పవర్ స్టార్ ఎవరు అంటే.. ఇంకెవరు శ్రీనివాసనే కదా అంటారు అక్కడి జనాలు. మన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు లాగా తమిళ జనాలకు కూడా ఒక కామెడీ స్టార్ ఒకరున్నారులెండి. అతనే ఈ శ్రీనివాసన్.

తనే సొంతంగా సినిమాలు నిర్మిస్తూ అందులో వీర లెవెల్లో బిల్డప్పులిస్తుంటాడు ఈ శ్రీనివాసన్. తరచుగా పెద్ద హీరోల మీద కామెంట్లు చేసే హీరో తాజాగా.. ‘‘నాకు సూపర్ స్టార్ రజనీకాంత్ తో మాత్రమే పోటీ. మిగతా స్టార్లు ఎవ్వరూ నాకు అసలు పోటీనే కాదు’’ అంటూ సెన్సేషనల్ కామెంట్ చేశాడు. తన కొత్త సినిమా ‘వాంగ వాంగ’ ఆడియో వేడుకలో శ్రీనివాసన్ తనదైన శైలిలో కామెడీ స్పీచ్ తో అలరించాడు. తాను సిల్క్ స్మిత లాంటి వాడినని.. అప్పట్లో ఆమె డ్యాన్సుకి ఎంత క్రేజ్ ఉండేదో.. తన డ్యాన్సుకి కూడా అంతే క్రేజ్ ఉందని అతనన్నాడు. ఈ మధ్య ఓ నిర్మాత తన సినిమాలో డ్యాన్స్ నెంబర్ చేయాల్సిందిగా రూ. 8 లక్షలు ఆఫర్ చేశాడని.. ఐతే ఇంకో రెండు లక్షలు కలిపి రూ.10 లక్షలు రౌండ్ ఫిగర్ ఇవ్వమని తాను అడిగానని అన్నాడు శ్రీనివాసన్.

ఐతే పది లక్షలంటే సిల్క్ స్మితకు ఇచ్చే దానికంటే ఎక్కువ అని ఆ నిర్మాత అంటే.. తాను మగ సిల్క్ స్మిత అని బదులిచ్చానని చెప్పాడు పవర్ స్టార్. ఇక రజినీకాంత్ గురించి చెబుతూ.. ‘‘నేను రజనీ సార్ ను ఎంతో ఆరాధిస్తాను. ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్స్.. హార్డ్ వర్క్.. పట్టుదల ఈ స్థాయికి చేర్చాయి. ఆయన కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలున్నాయి. ఎంతోకష్టపడ్డారు. నేను కూడా ఆయన్నే ఫాలో అవుతున్నా. ఆయనొక్కడిని మాత్రమే నా కాంపిటీటర్ గా భావిస్తున్నా’’ అన్నాడు శ్రీనివాసన్.