Begin typing your search above and press return to search.
అల్లూరిగా మహేశ్ బాబు .. కృష్ణ ఏమన్నాడంటే ..?!
By: Tupaki Desk | 19 May 2022 2:30 AM GMTమహేశ్ బాబు నటన .. డైలాగ్ డెలివరీ చాలా సహజంగా ఉంటాయి. తాను కెమెరా ముందు ఉన్నట్టుగా ఆయన అనుకోడు .. ఆయనను తెరపై చూస్తున్న ప్రేక్షకులు అనుకోరు. అందుకు కారణం చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చేస్తుండటమే. బాలనటుడిగా చేయడానికి ముందు తండ్రితో కలిసి సినిమా షూటింగులకు వెళ్లడం .. ఆ తరువాత తండ్రితో కలిసి నటించడం .. హీరోగాను తనదైన ప్రత్యేకతను చాటుకోవడం జరిగింది. దీనంతటికి కారణం తన తండ్రి .. ఆయన అభిమానుల ప్రోత్సాహం అనే మహేశ్ చెబుతుంటాడు.
అప్పట్లో ఎవరికీ లేని మాస్ ఫాలోయింగ్ కృష్ణకి ఉండేది. సినిమాలు చేసుకుంటూ వెళ్లడమే తనపని అని కృష్ణ అనుకునేవారు కాదు. ఏ సినిమా ఏ తరహా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతోంది .. ఏ సినిమా ఏ ఏరియాలో ఎంత వసూలు చేసింది అనే లెక్కలను ఆ రోజుల్లోనే ఆయన తెలుసుకుంటూ ఉండేవారు. అలాగే రిలీజ్ రోజునే తన సినిమా ఫ్లాప్ అని తెలిస్తే నిర్మొహమాటంగా ఆ విషయాన్ని ఆయన ఒప్పుకునేవారు. ఫ్లాప్ అయినా హిట్ అంటూ ఎవరైనా ముఖస్తుతి చేస్తే, అది కరెక్ట్ కాదని అనేవారు.
ఇక మహేశ్ బాబు హీరో అయిన తరువాత, ఆయన సినిమాను చూసి తన అభిప్రాయాన్ని ముక్కుసూటిగా చెప్పేవారు. ఈ సినిమా ఇంత వసూలు చేస్తుందని ఆయన చెప్పిన లెక్కలు తప్పలేదు. అందువల్లనే కృష్ణ గారి అభిప్రాయం కోసం ఇప్పటికీ అభిమానులు ఎదురు చూస్తుంటారు. మహేశ్ బాబు తాజా చిత్రంగా వచ్చిన 'సర్కారువారి పాట' ప్రస్తుతం థియేటర్స్ లో ఉంది. ఈ సినిమాను గురించి కృష్ణ గారిని అడగ్గా ఆయన స్పందిస్తూ .. "ఈ సినిమా చూడగానే మహేశ్ కి కాల్ చేసి చెప్పాను .. చాలా బాగా యాక్ట్ చేశావు .. పోకిరి .. దూకుడు కంటే కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని చెప్పాను. అలాగే జరిగినందుకు హ్యాపీగా ఉన్నాడు.
ఇన్ని సంవత్సరాల తరువాత కూడా 'పోకిరి'లో కంటే కూడా వయసు తక్కువగా కనిపిస్తున్నాడు. బాగా మెయింటెయిన్ చేస్తాడు. షూటింగులు లేకపోతే జిమ్ లోనే ఎక్కువగా ఉంటాడు. అందువల్లనే అలా కనిపిస్తున్నాడు" అని అన్నారు. ' ఇక మహేశ్ బాబుకి అల్లూరి సీతారామరాజు పాత్ర చేసే ఆలోచన ఉందనే టాక్ వినిపిస్తోంది .. దీనిపై మీరేమంటారు?' అనే ప్రశ్నకు కృష్ణ స్పందిస్తూ 'హండ్రెడ్ పెర్సెంట్ చేయడు' అని తేల్చి చెప్పేశారు. ఇక ఈ సినిమా ఐదు రోజుల్లోనే 100 కోట్ల షేర్ మార్కును అందుకున్న సంగతి తెలిసిందే.