Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ నే పరుగులెట్టించిన సూపర్ స్టార్!
By: Tupaki Desk | 23 Jun 2022 11:30 PM GMTమహేష్ బాబు బాల నటుడిగా తెరంగేట్రం చేసి నేడు సూపర్ స్టార్ అయిన సంగతి తెలిసిందే. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తనయుడిని ఆరేళ్ల వయసు నుంచే సినిమా సెట్స్ కి తీసుకెళ్లడం ప్రారంభించారు. అలా కొంత కాలం జరిగిన తర్వాత 'నీడ' అనే సినిమాతో తొలిసారి మహష్ 1979 లో కెమెరా ముందుకొచ్చారు. ఆ తర్వాత 'పోరాటం'..'శంఖావరం'.. బజారు రౌడీ'..'ముగ్గురు కొడుకులు'..'గుఢచారి 117'..'కొడుకు దిద్దిన కాపురం'..'అన్నాతమ్ముడు'..'బాల చంద్రుడు' చిత్రాల్లో నటించారు.
ఆ తర్వాత 'రాజకుమారుడు'తో హీరోగా తెరంగేట్రం చేసారు. అటుపై మహేష్ ఎదిగిన విధానం..అతని స్టార్ డమ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. నేడు సూపర్ స్టార్ ని మించి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఇలా ఎంత ఎత్తుకు బిడ్డలు ఎదిగినా ఓ తండ్రికి ఎప్పుడు తనయుడు పాపాయిగానే కనిపిస్తాడు. సందర్భం వచ్చినప్పుడల్లా చిన్న నాటి జ్ఞాపకాల్లోకి తొంగిచూడని తండ్రులెవరుంటారు? సరిగ్గా అదే సన్నివేశం చోటు చేసుకుంది.
ఓ ఇంటర్వ్యూలో కృష్ణ తనయురాలు మంజులు మహేష్ గురించి ఓంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. నాన్నగారు మహేష్ ని చిన్నప్పుడే సూపర్ స్టార్ ని చేసేసారు కదా? అంటే అవునని బధులిచ్చారు కృష్ణ. 'నేను ఓ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాను. సెట్ లో అంతా ఎవరి బిజీలో వారున్నారు. మహేష్ అప్పుడు చాలా చిన్న వాడు.
తొలిసారి ఆ సినిమా (సినిమా పేరు గుర్తులేదు) షూటింగ్ వద్దకు తీసుకొచ్చాను. దూరంగా మెట్ల మీద కూర్చోబెట్టి నేను షూటింగ్ లో బిజీగా ఉన్నాను. ఆ సమయంలో మహేష్ అలా నన్నే చూస్తూ ఉండిపోయాడు. అప్పుడే నటిస్తావా నాన్న? అని దగ్గరకి వెళ్లి అడిగాను దానికి వాడు నన్ను స్టూడియో మొత్తం పరుగులు పెట్టించాడు. నేను ఆమాట అనగానే భయంతో స్టూడియో మొత్తం పరుగు తీసాడు.
వాడి వెనుక నేను కూడా పరుగుం అందుకోవాల్సి వచ్చిందని'' కృష్ణ ఎంతో ఆనందంతో నవ్వుతూ ఆ నాటి జ్ఞాపకాలు పంచుకున్నారు. అలా అనాడు సూపర్ స్టార్ ని మహేష్ పరుగులు పెట్టించారు. ఆ పరుగుకి కొన్నేళ్ల అనంతరం బ్రేక్ పడింది. 'నీడ' సినిమాతో తొలిసారి కెమెరా ముందుకొచ్చి నటించడంతో మహష్ కి క్యామ్ ఫియర్ తొలగిపోయింది.
అప్పటికి మహేష్ వయసు కూడా పెరిగింది. ఆ తర్వాత మళ్లీ కృష్ణని ఎలాంటి పరుగులు పెట్టించలేదు. బాల నటుడిగానే ప్రయాణం మొదలు పెట్టి నేడు అగ్రహీరోగా ఎదిగారు. త్వరలో పాన్ ఇండియా స్టార్ గానూ అవతరించనున్నారు. మహేష్ లో నటుడ్ని ఆవయసులోనే కృష్ణ బయటకు తీసారు. నేడు పెద్ద స్టార్ ని చేసారు. అందుకే మహేష్ ని తన దేవుడు ఎవరంటే? సూపర్ స్టార్ కృష్ణ అని గర్వంగా చెబుతారు.