Begin typing your search above and press return to search.
నరేష్ కోసం కృష్ణ - మహేష్ బాబు
By: Tupaki Desk | 9 March 2019 11:00 AM GMTరేపు జరగబోయే మా ఎన్నికల వాతావరణంతో ఫిలిం నగర్ వేడెక్కింది. శివాజీ రాజా సీనియర్ నరేష్ ల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ప్రచారంలో భాగంగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు ఎన్ని చేసుకుంటున్నా ప్రస్తుతానికి బలాబలాలు సమానంగానే కనిపిస్తున్నాయి. సాధ్యమైనంత మేరకు పరిశ్రమలో పెద్దల సపోర్ట్ తీసుకోవడానికి రెండు వర్గాలు విపరీతంగా కృషి చేస్తున్నాయి.
గత రెండేళ్లలో జరిగిన అభివృద్ధితో పాటు అనూహ్యంగా జరిగిన చేదు సంఘటనలను డీల్ చేయడంలో ఇప్పటి మా కార్యవర్గం సరిగా పనిచేయలేదని నరేష్ వర్గం ఆరోపిస్తుండగా మేము చేసినంత ఎవరు చేయలేదని ఇది ఏ సభ్యులను అడిగినా చెబుతారని శివాజీరాజా టీం కూడా ఘాటుగానే బదులిస్తోంది
ఈ సందర్భంగా నరేష్ ఇవాళ మహేష్ బాబుని కృష్ణ దంపతులను విడివిడిగా కలుసుకున్నాడు. మహేష్ ని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా రాజశేఖర్ జీవిత దంపతులు కూడా ఉన్నారు. కృష్ణ వద్దకు మాత్రం నరేష్ ఒక్కరే వెళ్లడం విశేషం. నరేష్ ఇంటి కుటుంబ సభ్యుడే కాబట్టి మహేష్ తో కృష్ణ విజయ నిర్మల దంపతుల సపోర్ట్ కూడా నరేష్ కె ఉంటుంది.
ఇది నేరుగా చెప్పేసుకోరు కానీ మనమే అర్థం చేసుకోవాలి. విజయం మీద నరేష్ చాలా ధీమాగా కనిపిస్తున్నారు. గత వర్గం వైఫల్యాలతో పాటు తను చేసిన పనులు గెలిపిస్తాయని నమ్మకంతో చెబుతున్నారు. ఈ సస్పెన్స్ రేపటి దాకా కొనసాగనుంది. రాజకీయ నాయకుల రేంజ్ లో ఈసారి మా ఎన్నికలు ఒకరకంగా యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి