Begin typing your search above and press return to search.

ఆ స్టార్ కిడ్ సినిమా లాంచ్ రేపే!

By:  Tupaki Desk   |   17 Oct 2018 9:38 AM GMT
ఆ స్టార్ కిడ్ సినిమా లాంచ్ రేపే!
X
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుండి హీరోలు తెలుగు తెరకు పరచయం కావడం కొత్తేమీ కాదు. ఈ జెనరేషన్లో సూపర్ స్టార్ గా మహేష్ బాబు కృష్ణగారి వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. మరోవైపు మహేష్ బావ సుధీర్ బాబు కూడా హీరోగా కొనసాగుతూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. తాజాగా మహేష్ బాబు మేనల్లుడు - టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు అశోక్ ఎంట్రీ కి ఇప్పుడు రంగం సిద్ధం అయింది.

ఇప్పటికే అశోక్ గల్లా టాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజా సమాచారం మేరకు ఈ సినిమాకు రేపే పూజాకార్యక్రమాలు జరుగుతాయట. దిల్ రాజు నిర్మాణం లో తెరకెక్కనున్న ఈ సినిమా లాంచ్ కు కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యి మనవడిని ఆశీర్వదిస్తారట. నూతన దర్శకుడు శశి ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. ఇతర డెబ్యూ హీరోల సినిమాల స్టైల్లోనే ఇది కూడా ఒక లవ్ స్టోరీ అని.. 'అదే నువ్వు.. అదే నేను' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సమాచారం.

ఈ సినిమాలో అశోక్ కు జోడీగా నభా నటేష్ నటిస్తోంది. రీసెంట్ గా 'నన్ను దోచుకుందువటే' సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన నభాకు ఫుల్ గా ఆఫర్లు వస్తున్నాయి. ఆ ఆఫర్లలో అశోక్ డెబ్యూ సినిమా కూడా ఒకటి. ఇక మహేష్ బాబు మేనల్లుడు నభాతో పోటీపడుతూ.. వెంటబడుతూ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో వేచి చూడాలి.