Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్‌ కృష్ణకు అస్వస్థత.. ప్రస్తుత పరిస్థితి ఏంటి!

By:  Tupaki Desk   |   14 Nov 2022 7:56 AM GMT
సూపర్ స్టార్‌ కృష్ణకు అస్వస్థత.. ప్రస్తుత పరిస్థితి ఏంటి!
X
సూపర్ స్టార్‌ కృష్ణ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు అంటూ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. స్వల్ప అస్వస్థత అంటూ నరేష్ పేర్కొన్నాడు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కృష్ణ చికిత్స పొందుతున్నారని.. 24 గంటల్లో ఆయన్ను డిశ్చార్జ్‌ చేసేందుకు వైద్యులు సిద్దం అవుతున్నారని తెలుస్తోంది.

కృష్ణ ను కాంటినెంటల్‌ హాస్పిటల్‌ లో జాయిన్‌ చేసిన విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు అంతా కూడా హుటా హుటిన హాస్పిటల్ కు తరలి వచ్చారు. మహేష్ బాబు మరియు నమ్రత లతో పాటు ఇతర కుటుంబ సభ్యులు అంతా కూడా అక్కడకు చేరుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

గత కొన్నాళ్లుగా కృష్ణ వయోభారం వల్ల ఏదో ఒక అనారోగ్య సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆయన ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటూ.. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం ను మానిటరింగ్ చేసుకుంటూ వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఉంటున్నాడు.

ఆదివారం రాత్రి సమయంలో ఆయన శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారని గమనించి వెంటనే ఆయన్ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స అందించిన వైద్యులు ప్రస్తుతం అంతా నార్మల్ గా ఉందని చెప్పారట.

ప్రస్తుతం నార్మల్ గానే ఆయన శ్వాస తీసుకుంటున్నారని.. ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలియజేశారట. నేడు సాయంత్రం లేదా రాత్రి వరకు కృష్ణ డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయట.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.