Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ ఫ్యాన్స్ థియేటర్లకొస్తారా?
By: Tupaki Desk | 2 Jun 2016 4:20 AM GMTచిరంజీవి శకం నుంచి వెనక్కి వెళ్తే.. ఎన్టీఆర్-ఏఎన్నార్ ల తర్వాత అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరో కృష్ణ. ఆ ఫాలోయింగే ఆయనకు సూపర్ స్టార్ అన్న బిరుదు తెచ్చిపెట్టింది. ఇప్పటికే కృష్ణను అభిమానించే వీరాభిమానులు పెద్ద సంఖ్యలోనే కనిపిస్తారు. హీరోగా కృష్ణ తన ప్రభ అంతా కోల్పోయిన టైంలో కూడా ఆయన్ని తెరమీద చూడ్డం కోసం థియేటర్లకు వెళ్లేవాళ్లు ఈ అభిమానులు. ఐతే ఓ దశ దాటాక కృష్ణకు ఓపిక లేకో.. తన సినిమాలన్నీ దారుణంగా బోల్తా కొడుతుండటం వల్లో ఆయన మేకప్ కు దూరం అయిపోయారు. బలాదూర్.. మల్లన్న లాంటి ఒకటీ అరా సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేశారు కానీ.. హీరో వేషాలకు మాత్రం పూర్తిగా స్వస్తి చెప్పేశారు. దీంతో కృష్ణ వీరాభిమానులు డిజప్పాయింట్ అయిపోయారు.
ఐతే ఇప్పుడు కృష్ణ మళ్లీ హీరోగా రీఎంట్రీ ఇస్తున్నారు. ‘శ్రీ శ్రీ’గా థియేటర్లలోకి దిగుతున్నారు. శుక్రవారమే ఈ సినిమా రిలీజవుతోంది. తన గత సినిమాలతో పోలిస్తే కృష్ణ ఇందులో చాలా భిన్నంగా.. కొంచెం ఉత్సాహంగా కనిపిస్తున్నారు. పదేళ్ల ముందు చేసిన సినిమాలతో పోలిస్తే కంటెంట్ కూడా బెటర్ గానే అనిపిస్తోంది. మరి కృష్ణను వెండితెరపై చూసుకోలేకపోతున్నామని ఫీలవుతున్న పాతతరం అభిమానులు ఇప్పుడు థియేటర్లకు వస్తారా అన్నది ప్రశ్న. కృష్ణ అభిమానులంటే చాలా వరకు వయసు మళ్లినవాళ్లే. వాళ్లు థియేటర్లకు రావడం బాగా తగ్గించేశారు. ఇప్పుడు ఓపిక చేసుకుని కృష్ణ సినిమాకు వస్తారేమో చూడాలి. మహేష్ ఫ్యాన్స్ కృష్ణ కోసం ఏమాత్రం ముందుకొస్తారు.. సాధారణంగా సినిమాలకు మహరాజ పోషకులైన యూత్ ఆడియన్స్ ఈ సినిమా మీద ఏమాత్రం ఆసక్తి చూపిస్తారన్నది సందేహమే. అందుకే ‘శ్రీ శ్రీ’ సినిమాకు ట్రేడ్ లో అంత ఆసక్తి కనిపించలేదు. చాలా తక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో?