Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ అభిమానిని- సూపర్ స్టార్ కృష్ణ
By: Tupaki Desk | 22 Dec 2018 4:28 AM GMTఆరోజుల్లో నటసార్వభౌముడు ఎన్టీఆర్ - సూపర్ స్టార్ కృష్ణ మధ్య పోటీ ఉండేదని అభిమానులు చెబుతుంటారు. నువ్వా .. నేనా? అంటూ సినిమాలు తీసేందుకు - నటుడిగా పైచేయి సాధించేందుకు కృష్ణ పెద్దాయనతో పోటీపడేవారని - ఆ క్రమంలోనే ఆ పోటీ ఎంతో ఆహ్లాదకరమైన పోటీకి తెర తీసేదని చెప్పుకునేవారు. సూపర్‌స్టార్ కృష్ణ స్పోర్టివ్ గా కెరీర్ ని మలుచుకునేందుకు ఎంతగానో పోటీపడ్డారు. అనుకున్నది సాధించారు. అప్పట్లోనే కృష్ణ నిర్మాతగా మారి `సింహాసనం` లాంటి భారీ చిత్రం తీయడానికి - ఆ సినిమాతో బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పీలహరిని బరిలో దించేందుకు కారణం కూడా ఈ పోటీనే అని చెబుతారు. అయితే అందుకు సింబాలిక్ గానే పెద్దాయనపై సూపర్ స్టార్ తన అభిమానం చాటుకున్నారు `ఎన్టీఆర్- కథానాయకుడు` ఆడియో వేదికపై.
సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ నేను చిన్నప్పట్నుంచి రామారావుగారి అభిమానిని. డిగ్రీ పూర్తయిన తర్వాత రామారావుగారిని కలవాలనే మద్రాసు వెళ్లాను. వారిని కలిసి `మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది. నాకు సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉంది. మీ పిక్చర్స్ లో ఏదైనా వేషం ఇవ్వండి`` అని అడిగానని తెలిపారు. దానికి ఆయన `నువ్వింకా చిన్న కుర్రాడిగానే ఉన్నావ్. రెండు - మూడేళ్లు అగితే నువ్వు పనికొస్తావ్. డెఫనెట్ గా వేషం ఇస్తాను అన్నార``ని తెలిపారు.
ఆ తర్వాతనే కృష్ణ హీరోగా ఆదుర్తి సుబ్బారావు `తేనె మనుషులు` చిత్రంతో హీరోని చేశారు. హీరో అయ్యి ఆ తర్వాత ఐదో సినిమా `స్త్రీ జన్మ`లో రామారావుగారితో నటించే అవకాశం కలిగిందని - ఆ తర్వాత నిలువుదోపిడి - విచిత్ర కుటుంబం సినిమాలు చేశానని - అందులో మూడు సినిమాలు హిట్ అయ్యాయని కృష్ణ తెలిపారు. ఆ తర్వాత పండంటి కాపురం 100 రోజుల వేడుకకు రామారావుగారు వచ్చారు. నేను స్టేజ్ పైనే రామారావుగారితో సినిమా చేయాలనుందని అనౌన్స్ చేస్తానని అంటే.. `తప్పకుండా బ్రదర్... నీ పిక్చర్ లో నేను యాక్ట్ చేస్తాను. కథ చూసుకోండి``అన్నారు. ఆ తర్వాత దేవుడు చేసిన మనుషులు సబ్జెక్ట్ వినిపిస్తే చాలా బావుందని - ఒకే షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేశారు. ఆ సినిమా అఖండ విజయాన్ని సాధించింది. ఆయనతో నేను చేసిన సినిమాలన్నింటిలో తమ్ముడిగానే నటించాను. బాలకృష్ణ ఈ ఫంక్షన్ కు పిలవడానికి వచ్చి ఆయన వేసిన గెటప్స్ ను ఫోన్ లో నాకు చూపించారు. 100 శాతం రామారావుగారిలాగానే బాలకృష్ణ కనిపించారు. `యన్.టి.ఆర్ కథానాయకుడు` -`యన్.టి.ఆర్ మహానాయకుడు` సినిమాలు ఘన విజయాలు సాధించి బాలకృష్ణగారికి గొప్ప పేరుని తీసుకురావాలి`` అన్నారు.