Begin typing your search above and press return to search.
సెల్ ఫోన్ వాడని సూపర్ స్టార్
By: Tupaki Desk | 4 Oct 2019 2:30 PM GMTడిజిటల్ యుగమిది. చేతిలో ఫోన్ లేనిదే పనవ్వదు. వయసుతో సంబంధం లేకుండా స్మార్ట్ ఫోన్ వినియోగంలో ఉంది. పనులన్నీ అరచేతిలో ఇమిడిపోయే ఫోన్ లోనే కానిచ్చేస్తున్నాం. ఒక్క రోజు చేతిలో ఫోన్ లేకపోయినా పనులన్నింటికీ బ్రేక్ పడిపోతుంది. అంతగా స్మార్ట్ ఫోన్ కి బానిసలమయ్యాం. అయితే పాతతరంలో కొందరు సెల్ ఫోన్ కి విరోధులు. స్మార్ట్ ఫోన్ మాట ఎత్తితే అందులో ఏం ఉంది అంటూ చాదస్తంగా కొట్టిపారేస్తారు. అందులో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు.
ఆయన సెల్ ఫోన్ ని అసలు దరి చేరనివ్వరట. ఎంత ఎమెర్జెన్సీ కాల్ అయినా సరే ల్యాండ్ లైన్ లో మాట్లాడుతారుట. ల్యాండ్ లైన్ తప్ప మరో ఫోన్ వాడరని తెలుస్తోంది. భారీ వర్షాలు.. గాలులు వీచినప్పుడు ల్యాండ్ లైన్ పనిచేయకపోతే అవి రిపేర్ అయ్యే వరకూ అటువైపే చూడరట. ఆ విషయంలో విజయ నిర్మల ఎన్నోసార్లు తనను మార్చాలని ప్రయత్నాలు చేసారు. కానీ కృష్ణ మాత్రం ససేమీరా అనేసే వారుట. ఎలక్ట్రానిక్ పరికరాలకు కొన్ని దశాబ్ధాలుగా ఆయన దూరంగా ఉన్నారట. విజయ నిర్మల ని కూడా స్మార్ట్ ఫోన్ వినియోగించొద్దని చాలా సార్లు చెప్పారుట. కానీ తప్పని పరిస్థితుల్లో ఆమె వాడేవారని తెలుస్తోంది.
సెల్ ఫోన్ వాడటం వల్ల కలిగే దుష్ఫాలితాలు గురించి బాగా తెలియడం వల్లే కృష్ణ ఇప్పటికీ ల్యాండ్ లైన్ లోనే మాట్లాడాతరని ఆయన సన్నిహితులు అంటున్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కూడా ఫోన్ కి దూరంగానే ఉంటారుట. కేవలం ఫోన్ వచ్చినప్పుడు మాత్రమే కాల్ మాట్లాడుతారు. తక్కిన సమయంలో సెల్ ఫోన్ కి ఆమడ దూరంలోనే ఉంటారని తెలిసింది. సెల్ ఫోన్ దుష్పరిణామాలు మామూలుగా లేవు. మెదడులో నరాల బలహీనత.. కండరాలు పటుత్వం కోల్పోవడం.. సెక్స్ కి పనికి రాకప్ఓవడం.. వీర్యకణాల వృద్ధి సడలిపోవడం వగైరా వగైరా ప్రమాదాల గురించి డాక్టర్లు నిరంతరం హెచ్చరిస్తూనే ఉన్నారు. సెల్ ఫోన్ టవర్ పరిసరాల్లో నివాసం ఉంటే ఆ ఇంట్లో అందరికీ గోవిందా! అని కూడా తేల్చి చెప్పారు.