Begin typing your search above and press return to search.
మాస్క్ లేయర్ చూసి పొరబడ్డారు..ఆయన ఆరోగ్యంగానే
By: Tupaki Desk | 15 April 2022 3:30 AM GMTసూపర్ స్టార్ కృష్ణ చాలా కాలంగా సినిమా ఈవెంట్లకు..ఇతర ఈవెంట్లకు హాజరు కానీ సంగతి తెలిసిందే. కేవలం తమ కుటుంబ సభ్యుల వేడుకలుకి తప్పని సందర్భంలో హాజరవుతున్నారు. మిగతా సమయంలో నానాక్రామ్ గూడలోని సొంత ఇంట్లోని ఎక్కువగా కాలక్షేపం చేస్తున్నారు. అయితే ఇటీవలే ఆయన తన కుటుంబ సభ్యులకు సంబంధించిన వేడుకలో కనిపించారు.
సూపర్ స్టార్ కృష్ణ..ఆయన సోదరుడు ఆదిశేష గిరిరావు తదితరలు అంతా ఒకేచోట కలిసి భోజనం చేసారు. ఆ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోల్ని కృష్ణ కుమార్తె మంజుల ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసారు. ఆ ఫోటోల్లో కృష్ణ ముఖం పై ఓ లేయర్ లా కనిపించింది. దానిని చూసిన నెటి జనులు కృష్ణ ఆరోగ్యం విషయంపై డిబేట్లు మొదలు పెట్టారు.
నెట్టింట ఆ అంశం చర్చనీయాంశంగా మారింది. కృష్ణ ఆరోగ్యంగానే ఉన్నారా? అని సందేహాలు వ్యక్తం చేసారు. దీంతో అభిమానులు కాస్త కంగారు పడిన వాతావరణం కనిపించింది. తాజాగా ఆ ఫోటోల్ని పరిశీలించిన చాలా మంది ఇదంతా అనవసర ప్రచారమని కొట్టిపారేస్తున్నారు. ఆయన ముఖంపై కనిపించిన లేయర్ ఆయన ధరించిన మాస్క్ కి సంబంధించినది అని..దాని చూసి నెటి జనులు పొరబడ్డారని కృష్ణ సన్నిహితులు తెలిపారు.
ఆయనకు ఎలాంటి సర్జరీలు గట్రా జరగలేదని వివరణ ఇచ్చారు. కృష్ణ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని.. ఫేస్ కి వేసుకున్న మాస్క్ కారణంగానే అలా కనిపించి ఉంటుందని` అన్నారు. దీంతో కృష్ణ ఆరోగ్యంపై వస్తోన్న అన్ని రకాల కథనాలకి పుల్ స్టాప్ పడింది.
ఇక సూపర్ స్టార్ సినిమాల్లో కనిపించి చాలా కాలమవుతోన్న సంగతి తెలిసిందే. వయసు మీద పడి ఆరోగ్యం సహకరించకపోవడంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అవసరం మేర బయట కనిపిస్తున్నారు. వీలైనంత వరకూ ఇంట్లోనే ఉంటున్నారు.