Begin typing your search above and press return to search.
ప్యారిస్ లో సూపర్ స్టార్ చిలౌట్
By: Tupaki Desk | 22 April 2019 4:44 AM GMTతన సినిమా ప్రారంభానికి ముందు .. రిలీజ్ ముందు.. ఏమాత్రం తీరిక చిక్కినా ఫ్యామిలీతో కలిసి విదేశీ ట్రిప్ లు వెళ్లేందుకు సూపర్ స్టార్ మహేష్ ఆసక్తిగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఆన్ లొకేషన్ ఉండగా షెడ్యూల్స్ గ్యాప్ లోనూ సడెన్ ట్రిప్ లు వెళ్లి వస్తుంటారు. గ్యాప్ దొరికితే అస్సలు విడిచిపెట్టరు. నమ్రత- సితార- గౌతమ్ బృందంతో విదేశీ ట్రిప్ వెళ్లడం అక్కడ పూర్తిగా రిలాక్స్ అయిపోయి తిరిగి సెట్స్ లోకి జాయిన్ అవ్వడం తనకో హాబీ. దీనివల్ల ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసినట్టు ఉంటుంది. తనకు పూర్తిగా మైండ్ రిలాక్సేషన్ పాజిబుల్. శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాల రిలీజ్ సమయంలోనూ మహేష్ ఫ్యామిలీ వెకేషన్లు వెళ్లి వచ్చారు. షూట్ గ్యాప్ లోనూ విదేశీ ట్రిప్ లు వెళ్లారు. ఈసారి కూడా మహర్షి చిత్రానికి సంబంధించిన అన్ని పనులు ముగించుకుని మహేష్ ప్యారిస్ ట్రిప్ వెళ్లారు. ఈ ట్రిప్ లో నమ్రతతో పాటు గౌతమ్ ఉన్న ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ నెలాఖరు నాటికి తిరిగి హైదరాబాద్ లో అడుగుపెడతారని తెలుస్తోంది.
`మహర్షి` చిత్రం మహేష్ కెరీర్ 25వ సినిమా. ఇప్పటికే ప్రచారంలో వేగం పెంచారు. సింగిల్స్ రిలీజ్ చేస్తూ అభిమానుల్లో వేడి పెంచుతున్నారు. ఇప్పటికే మూడు సింగిల్స్ రిలీజైతే దేవీశ్రీ మ్యూజిక్ కి మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. మిగతా పాటల్ని రిలీజ్ చేయనున్నారు. అలాగే రిలీజ్ కి ఇంకో 17రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. మే తొలి వారంలో ప్రీరిలీజ్ వేడుక ఉంటుందని తెలుస్తోంది. హైదరాబాద్ ప్రమోషన్స్ తో పాటు వైజాగ్ - విజయవాడ లాంటి చోట్ల ప్రచారానికి యూనిట్ ప్రణాళికలు వేస్తోందిట.
ఈ భారీ చిత్రంలో మహేష్ మూడు రకాల వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో అదరగొడతాడన్న చర్చ సాగుతోంది. ఫ్యామిలీ ఎమోషన్స్.. స్నేహం.. రైతులు ఇలా కీలకమైన బర్నింగ్ పాయింట్స్ తో ఈ సినిమా ఆద్యంతం రక్తి కట్టించేలా వంశీ పైడిపల్లి తెరకెక్కించారని మేకర్స్ చెబుతున్నారు. ఈ మూవీ అల్లరి నరేష్ కి కంబ్యాక్ అవుతుందా? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. ముంబై బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. దిల్ రాజు- పీవీపీ-అశ్వనిదత్ సంయుక్తంగా నిర్మించారు.