Begin typing your search above and press return to search.

సితార.. మహేష్.. గౌతమ్ అల్లరే అల్లరి

By:  Tupaki Desk   |   3 Feb 2019 5:09 AM GMT
సితార.. మహేష్.. గౌతమ్ అల్లరే అల్లరి
X
మహేష్ బాబు ఒక పక్కా ఫ్యామిలీ మ్యాన్. అందులో ఎవరికీ సందేహల్లేవు. టైమ్ దొరికితే చాలు ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్ళిపోతాడు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా పిల్లలతో సందడే సందడి. ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్ ను నమ్రత అంతకంటే బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేస్తుంది. ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులకోసం షేర్ చేస్తుంది.

రీసెంట్ గా అలాంటిదే ఒక ఫోటో పోస్ట్ చేస్తూ.. "ఒకరిపై ఒకరు పడుతున్నారు.. లంచ్ బ్రేక్ ఇంట్లో స్పెండ్ చేశాం" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. సితార పాప అలిగిందో ఏమోగానీ మహేష్ పక్కనే చేరి మురిపెంగా లాలిస్తున్నాడు. ఇక ఈ సూపర్ స్టార్ నాన్న-సూపర్ చిలిపి కూతురు ఇద్దరూ ఆడే ఆటను గౌతమ్ నవ్వుతూ గమనిస్తున్నాడు. అలా అని గౌతమ్ ఎక్కడో దూరంగా లేడు. మహేష్ బాబు పై వెనకే ఉన్నాడు. నమ్రత షేర్ చేసిన ఈ ఫోటో నెటిజనులకు సూపర్ గా నచ్చింది. హ్యపీ ఫ్యామిలీ అని ఒకరు.. చూ చ్వీట్ అని మరొకరు.. లవ్లీ అని ఇంకొకరు కామెంట్లు చేచేశారు. ఫ్యాన్స్ అయితే లైకులతో షేర్లతో హోరెత్తిస్తున్నారు.

సినిమాల విషయానికి వస్తే మహేష్ ప్రస్తుతం 'మహర్షి' షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ ఆఖరున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మరో టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. అల్లరి నరేష్ తో కలిసి నటిస్తూ సూపర్ స్టార్ అల్లరి మహేష్ గా మారాడేమో.. షూటింగ్ లోనే కాకుండా ఇంట్లో పిల్లలతో కలిసి అల్లరి చేస్తున్నాడు!