Begin typing your search above and press return to search.
దీపావళికి ల్యాండ్ అవ్వబోతున్న సూపర్ స్టార్
By: Tupaki Desk | 23 Oct 2022 3:40 PMసూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే తన మాతృ మూర్తిని కోల్పోయారు. ఆ బాధ నుండి ఇప్పుడిప్పుడే ఆయన తిరిగి కోలుకుంటున్నారు. ఇటీవల ఒక యాడ్ షూట్ లో కూడా మహేష్ బాబు పాల్గొన్నాడట. ఆ యాడ్ షూట్ పూర్తి అయిన వెంటనే ఒక్కడే విదేశాలకు వెళ్లాడు. ఈ మధ్య కాలంలో వ్యక్తిగతంగా ఒక్కడు ఎప్పుడు కూడా విదేశీ యాత్రకు మహేష్ వెళ్లింది లేదు.
ఎప్పుడు కూడా ఫ్యామిలీ పిల్లలతో విదేశాలకు వెళ్లే మహేష్ బాబు ఈసారి ఒక్కడే విదేశాలకు వెళ్లడం వెనుక ఉద్దేశ్యం ఏంటి అనేది క్లారిటీ లేదు. మహేష్ బాబు ఎందుకు వెళ్లాడు అనే విషయం పక్కన పెడితే ఆయన తిరిగి ఎప్పుడు వస్తున్నాడు అనే విషయంలో ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది.
ఫ్యామిలీ మెంబర్స్ తో దీపావళిని సెలబ్రేట్ చేసుకోవడం కోసం అన్నట్లుగా రేపు అంటే అక్టోబర్ 24న హైదరాబాద్ లో ల్యాండ్ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. దీపావళికి మహేష్ బాబు అభిమానులకు ఏమైనా సర్ ప్రైజ్ గిఫ్ట్ ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
నవంబర్ మొదటి వారంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను మహేష్ బాబు మొదలు పెట్టే అవకాశం ఉంది. ఇటీవలే మొదటి షెడ్యూల్ ను ముగించిన విషయం తెల్సిందే. రెండవ షెడ్యూల్ ఇప్పటికే మొదలు పెట్టాల్సి ఉన్నా కూడా ఇందిరా దేవి మృతి వల్ల ఆలస్యం అయ్యింది. నవంబర్ లో సినిమా ను పునః ప్రారంభించి వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో విడుదల చేయాలని భావిస్తున్నారు.
వచ్చే ఏడాది లో ఏప్రిల్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా లో కీలక పాత్ర ను మరో స్టార్ హీరోయిన్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం పుష్కర కాలంగా మహేష్ త్రివిక్రమ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.