Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ మహేష్ కు ఈ రెండు తెలియదంట తెలుసా?
By: Tupaki Desk | 13 July 2022 7:30 AM GMTటాలీవుడ్ లో దాదాపు 15 మందికి మించి హీరోలున్నారు. ఒక్క మెగా స్టార్ ఫ్యామిలీ నుంచే దాదాపుగా పది మందికి మించి హీరోలున్నారు. అయితే టాలీవుడ్ లో ఇంత మంది హీరోలున్నా ఓ స్టార్ హీరోకు ఇవి రెండూ తెలియవట రావట.
ఇంతకీ ఆ స్టార్ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు. టాలీవుడ్ లో వున్న హీరోలంతా తెలుగు వారే అన్నది అందరికి తెలిసిందే. ఎంత తెలుగు వారైనా అత్యధిక శాతం మందికి తెలుగు మాట్లాడటం, చదవడం వచ్చినా కొంత మందికి ఈ రెండూ రావని తెలుస్తోంది. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వున్నారట.
సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లో వున్నస్టార్ హీరోల్లో ఒకరన్నది తెలిసిందే. తనదైన మార్కు నటనతో, డైలాగ్ డెలివరీతో, యాక్టింగ్ డిక్షన్ తో సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు.
ఇటీవల `సర్కారు వారి పాట` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన మహేష్ త్వరలో త్రివిక్రమ్ డైరెక్షన్ లో తన 28వ ప్రాజెక్ట్ ని చేయబోతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఎస్.రాధాకృష్ణ ఈ భారీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు.
మాసీవ్ ఎపిక్ బ్లాక్ బస్టర్ గా తెరపైకి రానున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నుంచి ప్రారంభం కానుందని తెలిసింది. అంతే కాకుండా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయబోతున్నామని మేకర్స్ ఈ శనివారం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. వెండితెరపై తెలుగు డైలాగ్ లని సింగిల్ టేక్ లో చెప్పేసే మహేష్ బాబు తెలుగు చదవలేడట. అంతే కాకుండా తెలుగు రాయలేడని చెబుతున్నారు.
అయితే దర్శకులు చెప్పే డైలాగ్ లని గుర్తు పెట్టుకుని స్పాట్ లో చెప్పేస్తుంటారట. మహేష్ కి తెలుగు రాకపోవడానికి, చదవలేకపోవడానికి ప్రధాన కారణం ఆయన స్కూలింగ్ అంతా చెన్నైలో జరగడమే. ఇంతకీ చెన్నైలో మహేష్ క్లాస్ మేట్స్ ఎవరో తెలుసా?.. దళపతి విజయ్, హీరో కార్తి. స్టడీ అంతా చెన్నైలో జరగడం వల్లే మహేష్ కు తెలుగు రాయడం, చదవడం రాలేదట. పైగా చదివింది ఇంగ్లీష్ మీడియం కావడం కూడా ప్రధాన కారణంగా చెబుతున్నారు. మహేష్ తన గ్రాడ్యుయేషన్ ని చెన్నై లయోలా కాలేజీలో పూర్తి చేశారు.